మళ్లీ నటి నడుముపై చెయ్యేసాడు.. బోనీపై ఫైర్!
అతడు ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు.. ఇంతకుముందు ఇద్దరు హీరోయిన్లను అనుచితంగా తాకాడు! అని ఆరోపణలున్నాయి.
By: Tupaki Desk | 11 April 2024 4:29 AM GMTపార్టీలు ఫంక్షన్ల వేళ సెలబ్రిటీల ఫోటోషూట్ల సందడి తెలిసిందే. ఒక సినిమా ప్రచార వేడుకలో ప్రముఖ నిర్మాత తన సినిమాలో నటించిన నటి నడుముపై అనుచితంగా చెయ్యేశాడనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. అతడు ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు.. ఇంతకుముందు ఇద్దరు హీరోయిన్లను అనుచితంగా తాకాడు! అని ఆరోపణలున్నాయి. ఈ ఎపిసోడ్ లో ప్రముఖ నిర్మాత ఎవరో కాదు బోనీ కపూర్. అతడు ఇంతకుముందు ఊర్వశి రౌతేలాను అనుచితంగా తాకాడని సోషల్ మీడియాల్లో పెద్ద రచ్చయింది. ఇటీవలే అంబానీ కల్చర్ సెంటర్ లాంచ్ వేడుకలో కూడా పాపులర్ అమెరికన్ ఫ్యాషన్ మోడల్ కం టీవీ నటి జిగ్ హడిడ్ నడుముపై అసభ్యంగా చెయ్యేశాడని ఫోటోలను షేర్ చేస్తూ యూత్ బోలెడంత ట్రోలింగ్ చేసారు.
ఊర్వశి రౌతేలా - జిగి హడిద్ తర్వాత బోనీ కపూర్ ఇప్పుడు ప్రియమణి నడుముపై అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. మైదాన్ స్క్రీనింగ్ నుండి ఒక వీడియో క్లిప్ వైరల్ గా షేర్ అవుతోంది. నిర్మాత బోనీ నటి ప్రియమణితో పబ్లిక్ ఈవెంట్లో పోజులిస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజనులు కపూర్ జీ తాకిడిని నటి అసౌకర్యంగా భావించారని వ్యాఖ్యానిస్తున్నారు. బోనీ ఆమెను అనుచితంగా తాకారని ఆరోపించారు.
భారత మాజీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ నిజ జీవిత కథ ఆధారంగా అజయ్ దేవగన్ నటించిన `మైదాన్` చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రియమణితో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పటి ఘటన ఇది. అయితే సినిమాల ప్రమోషన్స్ సమయంలో నటీమణులతో ఫిలింమేకర్స్ సన్నిహితంగా ఫోటోషూట్లలో పాల్గొనేప్పుడు అనుకోకుండా అలా తాకడం చూస్తూనే ఉంటాం. అది ఉద్దేశపూర్వకంగానా లేక యథాలాపంగానా? అన్నది ఆలోచించేవారిని బట్టి ఉంటుంది.