70 వయసులో నిర్మాత బట్టతలపై వెంట్రుకలు
వయసుతో పనేం ఉంది.. మనసుండాలే కానీ..! ఈ కొటేషన్ వెనక మీనింగ్ ఏంటో సదరు నిర్మాతను చూస్తే అర్థమవుతుంది
By: Tupaki Desk | 24 Feb 2024 2:30 AM GMTవయసుతో పనేం ఉంది.. మనసుండాలే కానీ..! ఈ కొటేషన్ వెనక మీనింగ్ ఏంటో సదరు నిర్మాతను చూస్తే అర్థమవుతుంది. ఆయన వయసు సుమారుగా 70 .. కానీ చేసే పనులు 20ప్లస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా బట్టతలపై వెంట్రుకల్ని మొలిపించాడు. ఇటీవలే నటుడయ్యాడు గనుక ఇక నటనలోను సత్తా చాటాలనుకుంటున్నాడు. నిర్మాతగా, నటవారసురాళ్ల కెరీర్ ని తీర్చిదిద్దే బాధ్యత గల తండ్రిగా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న సదరు నిర్మాత ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నిస్సందేహంగా అతడు బోనీకపూర్. బాలీవుడ్ లో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న ఆయన ఇటీవల సౌత్ లోను సినిమాలు నిర్మిస్తూ ఇక్కడా హల్ చల్ చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నైలలో నిరంతరం మెరుస్తున్నాడు. తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లను పెద్ద స్టార్లను చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. కుమార్తెల సౌత్ కెరీర్ ని అసాధారణంగా ప్లాన్ చేస్తూ సంచలనంగా మారుతున్నాడు.
అయితే ఉన్నట్టుండి అతడి బట్టతలపై వెంట్రుకలు మొలిచాయి. అది కూడా 68 వయసు క్రాస్ చేస్తున్న ఈ సమయంలో ఆయన బట్టతలపై వెంట్రుకలు మొలవడం ఆశ్చర్యపరిచింది. తాజాగా అతడు తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వీడియోను షేర్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో బోనీ హైదరాబాద్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌ను ప్రారంభించినట్టు వెల్లడించాడు. తాను కూడా వారి కస్టమర్లలో ఒకరినని వెల్లడించాడు. బట్టతలపై వెంట్రుకలు మొలిచిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వయసులో అతడి ప్రయత్నాన్ని కొందరు అభినందించకుండా ఆగలేకపోతున్నారు. చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపై నటుడిగాను వర్థిల్లమని ఆశీర్వదిస్తున్నారు. బోనీ వీళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుండడం ఇంట్రెస్టింగ్.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నిర్మాత బోనీ కపూర్ 2023లో లవ్ రంజన్ 'తూ ఝూతి మైన్ మక్కార్'తో తన నటనను ప్రారంభించాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. బోనీ మాజీ తండ్రి పాత్రను పోషించారు. ఆయన వారసులు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్ తనను నటనను కొనసాగించడానికి పురికొల్పారని తన సోదరుడు సంజయ్ కపూర్ కూడా ఈ పాత్రను పోషించడానికి తనను ప్రోత్సహించారని బోనీ వెల్లడించాడు.