Begin typing your search above and press return to search.

టికెట్ బుకింగ్స్ ట్రెండ్.. టాప్ లో ఎవరు?

ఇక టికెట్ బుకింగ్స్ విషయానికి వస్తే, "సంక్రాంతికి వస్తున్నాం" ఈ ట్రెండులో మొదటి స్థానంలో ఉంది.

By:  Tupaki Desk   |   17 Jan 2025 6:41 AM GMT
టికెట్ బుకింగ్స్ ట్రెండ్.. టాప్ లో ఎవరు?
X

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో మూడు డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" నందమూరి బాలకృష్ణ "డాకు మహారాజ్" మరియు వెంకటేశ్ "సంక్రాంతికి వస్తున్నాం". ఈ మూడు చిత్రాలు విడుదలైన తరువాత ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా బుక్ మై షో టికెట్ బుకింగ్స్‌ను గమనిస్తే, సంక్రాంతి బరిలో ఆడియన్స్ ఎలా స్పందిస్తున్నారో అర్ధమవుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం

ఇక టికెట్ బుకింగ్స్ విషయానికి వస్తే, "సంక్రాంతికి వస్తున్నాం" ఈ ట్రెండులో మొదటి స్థానంలో ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా 3.49 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచిన ఈ చిత్రం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. ఇది వెంకటేశ్ కెరీర్‌లో అత్యధిక బుకింగ్స్ సాధించిన చిత్రం కావడం విశేషం. ఇప్పటికే సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.


డాకు మహారాజ్

మరోవైపు, బాలకృష్ణ "డాకు మహారాజ్" కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. గత 24 గంటల్లో ఈ సినిమా బుకింగ్స్ లో 73.55 వేల టికెట్స్ అమ్ముడవ్వడం విశేషం. బాలయ్య మాస్ క్రేజ్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. బాలకృష్ణ మాస్ ఫ్యాలోయింగ్‌తో పాటు సంక్రాంతి హాలిడే సీజన్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ చిత్రం అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా 100 కోట్లు దాటాయి.


గేమ్ ఛేంజర్

ఇక "గేమ్ ఛేంజర్" విషయానికి వస్తే, గత 24 గంటల్లో 44.54 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. భారీ బడ్జెట్, రామ్ చరణ్ నటన, శంకర్ డైరెక్షన్ ఉన్నప్పటికీ, టాక్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడం టికెట్ బుకింగ్స్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, మొదటి రోజు భారీ వసూళ్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఎంతోకొంత ఆసక్తి కలిగిస్తోంది. అందుకే బుకింగ్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి. హాలిడే సీజన్ కారణంగా సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. 200 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టగలదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


మూడు చిత్రాలు కలిపి చూస్తే, సంక్రాంతి హాలిడే సీజన్‌ను గట్టిగా క్యాష్ చేసుకోవడంలో "సంక్రాంతికి వస్తున్నాం" ముందు ఉందని చెప్పొచ్చు. "డాకు మహారాజ్" యాక్షన్ లవర్స్‌ను ఆకర్షించగా, "గేమ్ ఛేంజర్" తన ప్రేక్షకులను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

మొత్తానికి, ఈ సంక్రాంతి థియేటర్లు పండగ వాతావరణాన్ని అందిస్తున్నాయి. టికెట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే, ప్రేక్షకుల రుచి, రేటింగ్‌లతో పాటు హాలిడే ఎఫెక్ట్ ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టమవుతోంది. ఇక ఈ మూడు చిత్రాల చివరి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.