బాస్ బరిలో దిగేది మళ్లీ అప్పుడే
అయితే బాస్ తిరిగి పనిలోకి వచ్చేదెపుడు? అంటే... పూర్తిగా ఫిజియో సెషన్స్ పూర్తయిన తర్వాతే షూటింగుల్లో పాల్గొంటారని తెలిసింది.
By: Tupaki Desk | 13 Oct 2023 7:26 AM GMTమెగాస్టార్ చిరంజీవికి ఇటీవల మోకాలి గాయానికి చికిత్స జరుగుతున్న సంగతి విధితమే. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స కారణంగా కొన్ని వారాలుగా చిరు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం దీనికి సుశిక్షితుల సమక్షంలో ఫిజియో థెరపీ కొనసాగుతోంది. మధ్యలోనే మెగా వెడ్డింగ్ కోసం చిరు అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ బాస్ అనవసరమైన పెయిన్ స్ట్రెయిన్ తీసుకోకూడదు. అందుకే షూటింగులకు కూడా గ్యాప్ ఇచ్చారు. ఇకపై వరుణ్ తేజ్ పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తర్వాతా మరో రెండు వారాల పాటు ఫిజియోథెరపీ సెషన్స్‌ను కొనసాగించాల్సి ఉంటుందని తెలిసింది.
అయితే బాస్ తిరిగి పనిలోకి వచ్చేదెపుడు? అంటే... పూర్తిగా ఫిజియో సెషన్స్ పూర్తయిన తర్వాతే షూటింగుల్లో పాల్గొంటారని తెలిసింది. చిరు ప్రస్తుతం రెండు సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఇందులో బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషియో ఫాంటసీ కథాంశంలో నటించాల్సి ఉంది. డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగే అవకశం ఉందని కూడా తెలుస్తోంది. అప్పటివరకూ దర్శకరచయితలు స్క్రిప్టుపై వందశాతం పనిని పూర్తి చేయడమే గాక ప్రీప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక వగైరా పనుల్ని పూర్తి చేస్తారని తెలిసింది.
వరుణ్ పెళ్లికి ఏర్పాట్లు..
ఇప్పటికే మెగా ఇంట పెళ్లి వేడుకలు మొదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఇటలీ టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక జరగనుంది. ఈ పెళ్లికి చిరంజీవి సహా మెగా- అల్లు హీరోలు ఇతర కుటుంబీకులు హాజరు కానున్నారు. ఈ వేడుకకు మెగా ఆడపడుచులంతా అటెండవుతారు.
ప్రస్తుత గ్యాప్ లో చిరు ఏం చేస్తున్నారు?
ఈ గ్యాప్ లో చిరు ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నారు? అనేది అభిమానుల సందేహం. అయితే దీనికి జవాబు స్పష్టంగా ఉంది. చిరు ఎప్పుడూ తన తీరిక సమయాన్ని కుటుంబం కోసమే అంకితమిస్తారు. మొన్న వినాయక చవితి వేడుకలు సహా ఇతర పండుగల్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్నప్పుడు అభిమానులు, సందర్శకులతోను మంతనాలు సాగిస్తుంటారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల కోసం పార్టీలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మోకాలి చికిత్స కారణంగా చిరు తన కదలికలను పరిమితం చేసారు. అనవసరమైన స్ట్రెయిన్ ఇవ్వకూడదని వైద్యులు సూచించినట్టు తెలిసింది.