Begin typing your search above and press return to search.

డైరెక్టర్, హీరో ఇద్దరికి 65+.. జెట్ స్పీడ్ లో సినిమా

కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:07 AM GMT
డైరెక్టర్, హీరో ఇద్దరికి 65+.. జెట్ స్పీడ్ లో సినిమా
X

లెజండరీ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న మణిరత్నం గత ఏడాది పొన్నియన్ సెల్వన్ 2తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కోలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఏకంగా 36 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం మూవీ చేయబోతూ ఉండటం విశేషం. చివరిగా వీరిద్దరి కాంబోలో నాయకుడు మూవీ వచ్చి సెన్సేషన్ హిట్ అయ్యింది. మరల ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు.

కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మల్టీ స్టారర్ చిత్రంగానే ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జయం రవి, దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నారు.

ఈ సినిమాని కేవలం 5 నెలల్లో పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేసుకుంటున్నారంట. పక్కా ప్లానింగ్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడం ద్వారా షెడ్యుల్ వేసుకొని తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయాలని మణిరత్నం అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. పొన్నియన్ సెల్వన్ 2 షూటింగ్ కూడా కేవలం 150 రోజుల్లోనే మణిరత్నం పూర్తి చేశారు. అలాగే కమల్ మూవీకి ప్లానింగ్ వేసారంట.

వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. దుల్కర్, జయం రవిలకి మణిరత్నం కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కమల్ హాసన్ మణిరత్నం ఇద్దరి వయసు కూడా 65 ఏళ్ళకు పైగానే ఉంటుంది. అలాంటిది ఈ వయసులో ఈ టాలెంటెడ్ ఐకాన్స్ 5 నెలల టార్గెట్ లో సినిమాను పూర్తి చేస్తూ ఉండడం విశేషం అనే చెప్పాలి. చూడాలి మరి ఇంత జెడ్ స్పీడ్ లో ఎలాంటి కంటెంట్ అందిస్తారో.