Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రు ఓపెన్...ఇక గురూజీ చేతుల్లోనే

ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ పై కొన్ని రకాల విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:30 PM GMT
వాళ్లిద్ద‌రు ఓపెన్...ఇక గురూజీ చేతుల్లోనే
X

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో సినిమాలు చేయాల‌ని ఏ హీరోకి ఉండ‌దు. అత‌ని క‌థ‌లు..విజ‌యాలు చూస్తే గురూజీతో ఒక్క సినిమా అయినా చేయాల‌ని హీరోలంతా ఆశ‌ప‌డుతుంటారు. కానీ ఏ హీరోతో సినిమా చేయాలి? అన్న‌ది గురూజీ చేతుల్లో ఉంటుంది. అత‌ను త‌న‌కు న‌చ్చిన హీరోల‌తోనే సినిమాలు చేస్తుంటారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ పై కొన్ని రకాల విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

ఆయ‌న కేవ‌లం కొంద‌రు హీరోల‌తోనే పనిచేస్తాడ‌ని...అంద‌రితో ప‌నిచేయ‌డు అన్న విమ‌ర్శ ఒక‌టుంది. ఇక త్రివిక్ర‌మ్ రైట‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసారు. అందులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన 'మ‌ల్లీశ్వ‌రి'..'నువ్వు నాకు న‌చ్చావ్' చిత్రాలు. ఈ రెండు సినిమాలు డైరెక్ట్ చేసింది విజ‌య్ భాస్క‌ర్ అయితే..వాటికి డైలాగులు..క‌థ‌ రాసింది త్రివిక్ర‌మ్. ఆ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఆ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి.

ఈ నేప‌థ్యంలో 'నువ్వు నాకు న‌చ్చావ్' సినిమాకి సీక్వెల్ కావాలంటూ అభిమానులు చాలా సంద‌ర్బాల్లో అడిగారు. ఆ సీక్వెల్ చేయ‌డానికి వెంక‌టేష్ కూడా సిద్దంగానే ఉన్నారు. ఇటీవ‌లే వెంకీ ముందుకు ఈ ప్ర‌శ్న వెళ్లింది. సీక్వెల్ కావాలంటూ మ‌రోసారు అడిగగా అందుకు వెంక‌టేష్ వెళ్లి త్రివిక్ర‌మ్ ని అడ‌గండ‌ని అన్నారు. ఆ రూపంలో త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాలి అన్న ఆస‌క్తిని వెంకీ మ‌రోసారి రివీల్ చేసారు.

అలాగే నేచుర‌ల్ స్టార్ నాని ముందుకు ఇలాంటి ప్ర‌శ్నే ఒక‌టి వెళ్లింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి నాని సినిమా చేయాలంటూ ఓ అభిమాని కోరాడు .దీనికి నాని త్రివిక్ర‌మ్ గారు వింటున్నారా? చూస్తున్నారా? అభిమానులు ఎలా అడుగుతున్నారో? అంటూ ఆయ‌న పేరు గుర్తు చేసారు. వాస్త‌వానికి త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం మ‌హేష్ తో 'గుంటూరు కారం' చిత్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో మ‌హేష్ పేరు ప్ర‌స్తావ‌న కి రావ‌డం...ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్ ని నాని త‌లుచుకోవ‌డం జ‌రిగాయి. ఇలా వెంకీ..నాని ఇద్ద‌రు గురూజీ ఛాన్స్ ఇస్తే సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు ఓపెన్ గానే చెప్పేసారు. కానీ త్రివిక్ర‌మ్ గుంటూరు కారం పూర్తి చేసిన త‌ర్వాత బ‌న్నీతో సినిమా చేస్తాడు? అన్న సంగ‌తి తెలిసిందే.