Begin typing your search above and press return to search.

పవన్, మహేష్.. ఇద్దరిలో ఓకే ఆలోచనలు

అలాగే ఇండియాలోనే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటులుగా ఎదిగారు.

By:  Tupaki Desk   |   15 May 2024 7:30 AM GMT
పవన్, మహేష్.. ఇద్దరిలో ఓకే ఆలోచనలు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా ఇంచు మించు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారు. ఇద్దరు తమదైన టాలెంట్ తో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇద్దరు కూడా స్టార్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన కూడా ఈ రోజు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఇండియాలోనే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటులుగా ఎదిగారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్ ఉన్నా కూడా టాలీవుడ్ లో మాత్రం వారి నలుగురి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల ఇమేజ్ పెద్దది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి సినిమాలు తగ్గించేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం హీరోగా వరుస విజయాలు అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు.

సౌత్ లో అత్యధికంగా కమర్షియల్ యాడ్స్ చేసే నటుడిగా మహేష్ బాబు ఉన్నాడు. కమర్షియల్ యాడ్స్ ద్వారానే మహేష్ బాబు వందల కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. ఇక వ్యక్తిత్వ పరంగా ఇద్దరిలో చాలా సారూప్యతలు ఉన్నాయని మహేష్ బాబు అక్క యాక్టర్ మంజుల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు కూడా తమ మనస్సు చెప్పిందే చేస్తారని, ఎవరైనా చెబితే వింటారు కానీ నిర్ణయం మాత్రం వారికి నచ్చినట్లు తీసుకుంటారని ఆమె తెలిపారు. అలాగే ఇద్దరు కూడా కొంత వరకు అనవసర విషయాల జోలికి పోకుండా వారి ప్రపంచంలో ఉంటారని అన్నారు. అలాగే ఇద్దరికి సామాజిక దృక్పథం ఉందని, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నవారిని మంజుల పేర్కొన్నారు. ఆమె మాటలని ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సమర్థిస్తున్నారు.

వ్యక్తిత్వాల పరంగా సారూప్యతలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఒకేసారి హీరోలుగా ప్రయాణం మొదలుపెట్టి స్టార్స్ గా నిలబడ్డారని అభిమానులు అంటున్నారు. అలాగే ఇద్దరి మధ్య కూడా మంచి ఫ్రెండ్లీ వాతావారణం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలని ఇష్టంగా భావించి సుదీర్ఘకాలం కొనసాగేందుకు సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు. అతని ధ్యాస ఎక్కువగా అంత సినిమాలపైనే ఉంది. అలాగే చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించడం, గ్రామాలను దత్తత తీసుకోవడం వంటి మంచి పనులు కూడా చేశాడు.