Begin typing your search above and press return to search.

థౌజండ్ వాలా త‌దుప‌రి పేల్చేది వీళ్లేనా!

బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల వ‌సూళ్లు అన్న‌ది బాలీవుడ్..టాలీవుడ్ కి న‌ల్లేరు మీద న‌డ‌క లాంటింది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 1:30 PM GMT
థౌజండ్ వాలా త‌దుప‌రి పేల్చేది వీళ్లేనా!
X

బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల వ‌సూళ్లు అన్న‌ది బాలీవుడ్..టాలీవుడ్ కి న‌ల్లేరు మీద న‌డ‌క లాంటింది. అంత‌కు మించి ఏదైనా కొత్త‌గా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌రిత్ర రాయాలి త‌ప్ప‌! 1000 కోట్ల టాపిక్ అన్న‌ది ఓల్డ్ మాట‌గా ఆ రెండు ప‌రిశ్ర‌మ‌లు భావిస్తుంటాయి. 2000 కోట్ల వ‌సూళ్ల‌తో బాలీవుడ్ లో `దంగ‌ల్`...1800 కోట్ల వ‌సూళ్ల‌తో `పుష్ప‌2` ఈ ర‌కమైన కొత్త చ‌రిత్ర రాయ‌డంతో? వెయ్యి కోట్లు అన్న‌ది రెండు ప‌రిశ్ర‌మ‌ల్లో కామ‌న్ గా మారిపోయింది.

ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల త‌ర్వాత శాండిల్ వుడ్ నిలిచింది. `కేజీఎఫ్` తో శాండ‌ల్ వుడ్ కూడా 1000 కోట్ల వ‌సూళ్ల‌లో మూడ‌వ స్థానంలోంది. ఈ రేసులో వెనుక‌బ‌డిన ప‌రిశ్ర‌మ కోలీవుడ్. అక్క‌డ ప‌రిశ్ర‌మ 700 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చింది గానీ 1000 కోట్ల క్ల‌బ్ లో మాత్రం ఇంకా చేర‌లేదు. 2025 లోనైనా కోలీవుడ్ ఆశ నెర‌వేరుతుందేమో చూడాలి. అయితే మ‌రోసారి 1000 కోట్లు కొల్ల‌గొట్టే స‌త్తా మాత్రం మ‌ళ్లీ బాలీవుడ్ ...టాలీవుడ్ కే క‌నిపిస్తుంది.

బాలీవుడ్ లో `వార్ 2`పై ఈ ర‌క‌మైన అంచ‌నాలున్నాయి. అందులో హృతిక్ రోష‌న్ తో పాటు మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా న‌టిస్తున్నారు. కాబ‌ట్టి తెలుగు మార్కెట్ కీల‌కం కానుంది. అటు బాలీవుడ్లో హృతిక్ రాణిస్తాడు. టాలీవుడ్ లో తార‌క్ ఉంటాడు కాబ‌ట్టి! 1000 కోట్ల వ‌సూళ్లు ఆసినిమాకి మెండుగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్ న‌టిస్తోన్న `ఫౌజీ`కి ఆ ఛాన్స్ ఉంది. `సీతారామం` త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తోన్న భారీ వార్ ల‌వ్ స్టోరీ ఇది.

సినిమాపై అంచ‌నాలున్నాయి. 1000 కోట్లు రాబ‌ట్ట‌డం ప్ర‌భాస్ కి జుజూబీ లాంటింది. ఆ త‌ర్వాత శాండిల్ వుడ్ నుంచి య‌శ్ న‌టిస్తోన్న `టాక్సిక్` ఉంది. ఈ సినిమాపైనా భారీ అంచ‌నాలున్నాయి. `కేజీఎఫ్` త‌ర్వాత య‌శ్ నుంచి రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇక చివ‌రిలో ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో చిత్రం `రాజాసాబ్` ఉంది. కానీ ఇది 1000 కోట్లు తేవాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద అద్బుతాలు జ‌ర‌గాలి. ఇది హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రం. ప‌క్కా మారుతి మార్క్ ఎంట‌ర్ టైన‌ర్. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది.