Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ లెక్కలపై నిర్మాత ఫుల్ క్లారిటీ

స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తే మూవీ కలెక్షన్స్ ఎంత అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అలాగే మీడియాకి లీకులు ఇస్తారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:58 AM GMT
బాక్సాఫీస్ లెక్కలపై నిర్మాత ఫుల్ క్లారిటీ
X

స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తే మూవీ కలెక్షన్స్ ఎంత అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అలాగే మీడియాకి లీకులు ఇస్తారు. సినిమా వంద కోట్లు దాటిపోయింది అంటూ ఊదరగొడతారు. మీడియం రేంజ్ హీరో మూవీ కలెక్షన్స్ వంద కోట్లు దాటితే ఆ మూవీకి పెద్ద అది పెద్ద క్రేజ్ అవుతుంది. ఇలా కలెక్షన్స్ లెక్కలతో పోస్టర్స్ రిలీజ్ చేయడం వెనుక కూడా మార్కెటింగ్ లెక్కలు ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ మూవీకి హీరో బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రేట్లకి మూవీ అమ్ముకోవచ్చు. ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యే ఇలా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అయితే ఈ కలెక్షన్స్ నిజంగా ఒరిజినల్ అని ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ అనుకుంటారు. అయితే ఈ విషయంపై సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగావంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియా జెర్సీ సినిమా గురించి ప్రశ్నించారు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నష్టాలు వచ్చాయి కదా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ కదా అని అడిగారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే విషయం మీకు ఎవరు చెప్పారు. జెర్సీ మూవీతో నిర్మాతకి లాభాలు వచ్చాయి అని క్లారిటీ ఇచ్చారు.

జెర్సీ మూవీ నిర్మాత నాగవంశీ కూడా ట్విట్టర్ లో దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాతో మాకు లాభాలు వచ్చాయని తెలిపారు. ఒక మూవీ కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయ్యిందనేది నిర్మాతకి తప్ప ఇంకెవరికి తెలియదు. అసలు మేము మీడియాకి మా కలెక్షన్ లెక్కలు ఎప్పుడూ కూడా వాస్తవం చెప్పము. అలా చెప్పడం వలన జరిగే నష్టం ఏంటో నాకు తెలుసు అంటూ వంశీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాకి లాభాలు వస్తే వాటిని ఎవరికి ఎవ్వము నష్టాలు వచ్చిన నాకు ఎవరూ పైసా కూడా ఇవ్వరు. బాక్సాఫీస్ కలెక్షన్స్ కచ్చితంగా నిరూపించడానికి ఎలాంటి మెకానిజం లేదంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. అలాగే కలెక్షన్స్ లెక్కలపై ప్రశ్నలు అడిగి సంబంధం లేకుండా హీరోలని ఇన్సల్ట్ చేయకండి. అసలు హీరోలకి కలెక్షన్స్ తో సంబంధం ఉండదంటూ కూడా నాగవంశీ జర్నలిస్టులకి సలహా ఇచ్చారు.