అన్నీ భాషల్లోనూ అదే పరిస్థితి అదేంటంటే?
'కల్కీ 2898' తర్వాత బాక్సాఫీస్ వద్ద సౌండింగ్ హిట్ ఒకటీ కనిపించలేదు. కల్కి రిలీజ్ అయిన ఇప్పటి నోల రోజులు దాటింది
By: Tupaki Desk | 6 Aug 2024 6:02 AM GMT'కల్కీ 2898' తర్వాత బాక్సాఫీస్ వద్ద సౌండింగ్ హిట్ ఒకటీ కనిపించలేదు. కల్కి రిలీజ్ అయిన ఇప్పటి నోల రోజులు దాటింది. రెండవ నెల రన్నింగ్ లో ఉంది. ఈమధ్య లో అన్ని పరిశ్రమల నుంచి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో ఏది సరైన హిట్ అందుకున్నట్లు కనిపించలేదు. కొన్ని సినిమా రిలీజ్ లు చూసి ఈ సినిమా రిలీజ్ అయిందా? అని మాట్లాడుకోవడం ప్రేక్షకుల వంత్తైంది. రిలీజ్ కి ముందు కాస్తో కూస్తో అంచనాలున్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడినవే.
టాలీవుడ్..బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఫేమస్ అయిన అన్నివుడ్ లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత వారం జాన్వీ కపూర్ నటించిన 'ఉలజ్' ..అజయ్ దేవగణ్ నటించిన 'ఔరాన్ మే కహన్ దమ్ థా' రిలీజ్ అయ్యాయి. ఈ రెండు తొలి షో తోనే నిరాశ పరిచాయి. రెండూ సినిమాలకు నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. మౌత్ టాక్ నెగిటివ్ గానే బయటకు వచ్చింది. దీంతో జాన్వీ కెరీర్ పరంగా పరాజయాల పరంపర కొనసాగు తుందన్న విషయం అర్దమైంది.
అమ్మడికి బవాల్ కి ముందు మూడు నాలుగు, తర్వాత మూడు నాలుగ సినిమాల చేసింది. కానీ వీటిలో ఏది జాన్వీకి సరైన గుర్తింపు తీసుకురాలేదు. సినిమా ప్లాప్ అయినా నటిగా పాస్ అయింది? అన్న ప్రశంస కూడా ఏ సినిమాకి రాలేదు. తాజాగా 'ఉలజ్ 'సినిమా వసూళ్లు కూడా మరింత పేలవంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం 1.35 కోట్ల ఓపెనింగ్ తర్వాత 1.75 కోట్లు వసూళ్లకు చేరుకుందంతే. అజయ్ దేవణ్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది.
'మైదాన్' తో విమర్శకుల ప్రశంసలందుకున్నా వసూళ్ల పరంగా ఏం లాభం లేదు. ఆరకంగా చూస్తే మైదాన్ డిజాస్టర్ లోనే పడుతుంది. 'భోళా' కి ముందు చేసిన సినిమాలు..తర్వాత చేసిమా ఫలితాలు ఏమంత ఆశాజనకంగా లేవు. 'షైతాన్' తో మాత్రం భారీ విజయం నమోదు చేసారు. తాజా రిలీజ్ 'ఆరోన్ మే కహన్ దమ్ థా' 15 కోట్లు వసూళ్లు తేవడానికి నానా అవస్తులు పడుతుంది. ఇక టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
ఇటీవల విడుదలైన 'శివం భజే', 'టెడ్డీ', 'అల్నాటి రామ చంద్రుడు', 'తిరగబడరా సామి' సినిమా బాక్సాపీస్ వద్ద అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. వారంతంలో రెండు కోట్లు తేవడం కూడా కానా కష్టంగా కనిపిస్తుంది. అటు తమిళం, మలయాళ పరిశ్రమలు కూడా ఈ వారం గడ్డు పరిస్థితినే చూసాయి. ధనుష్ రాయన్ మాతృభాష వరకూ కొంత పర్వాలేదు.