Begin typing your search above and press return to search.

అది బాక్సాఫీస్ ను పేల్చే పండగే..

ఒకప్పుడు సినిమాలు రీజనల్ భాషలకి మాత్రమే పరిమితం కావడం వలన ఇతర భాష సినిమాలతో పెద్ద పోటీ ఉండేది కాదు

By:  Tupaki Desk   |   15 April 2024 6:05 AM GMT
అది బాక్సాఫీస్ ను పేల్చే పండగే..
X

ఒకప్పుడు సినిమాలు రీజనల్ భాషలకి మాత్రమే పరిమితం కావడం వలన ఇతర భాష సినిమాలతో పెద్ద పోటీ ఉండేది కాదు. అయితే పాన్ ఇండియన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మల్టీ లింగ్వల్ లో సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ లో తెరకెక్కిన సినిమా సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. అలాగే తెలుగులో స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫార్మాట్ లోనే ఐదు భాషలలో తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.

ఈ కారణంగా కాంపిటేషన్ పెరిగిపోయింది. భాషలకి పరిమితం కాకుండా స్టార్స్ అందరూ బిగ్ స్క్రీన్ దగ్గర పోటీ పడుతున్నారు. ఈ ఏడాది దీపావళి రేసులో ఏకంగా ఐదు సినిమాలు పోటీలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. తెలుగు నుంచి ఒక మూవీ, తమిళ్ నుంచి రెండు సినిమాలు, హిందీ నుంచి రెండు సినిమాలు దీపావళికి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాయి.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే మేగ్జిమమ్ దీపావళి డేట్ ని ఫిక్స్ చేస్తారని భావిస్తున్నారు. అదే టైంలో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హైవోల్టేజ్ యాక్షన్ మూవీ కంగువ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో చేస్తోన్న వేట్టయాన్ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోందంట. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు. దీంతో మూవీ పాన్ ఇండియా లెవల్ లో భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ సూపర్ హిట్ సిరీస్ లో సింగం రిటర్న్స్ రాబోతోంది. కమర్షియల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోంది. అలాగే కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో భూల్ భులయ్యా 3 మూవీ కూడా దీపావళి కానుకగానే ప్రేక్షకుల ముందుకి రు రాబోతోంది. ఈ ఐదు సినిమాలు కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్యనే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది సక్సెస్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.