Begin typing your search above and press return to search.

వేస‌వి ముందు ఊపేసేది వీళ్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా సంక్రాంతికే థియేట‌ర్లోకి వ‌చ్చేసారు. దీంతో స‌మ్మ‌ర్ రిలీజ్ లేకుండా పోయాయి

By:  Tupaki Desk   |   16 March 2024 1:30 AM GMT
వేస‌వి ముందు ఊపేసేది వీళ్లేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరోలంతా సంక్రాంతికే థియేట‌ర్లోకి వ‌చ్చేసారు. దీంతో స‌మ్మ‌ర్ రిలీజ్ లేకుండా పోయాయి. మిగ‌తా హీరోలంతా ఆన్ సెట్స్ లో నే ఉండ‌టంతో ఇప్ప‌ట్లో రిలీజ్ కూడా క‌ష్ట‌మైంది. మేలో 'క‌ల్కి 2898' మిన‌హా చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కి లేవు. మిగ‌తా చిత్రాల్ని చిన్న చిత్రాలే క‌నిపి స్తున్నాయి. ఈ నేపథ్యంలో అనువాద చిత్రాల‌తోనే ప్రేక్ష‌కులు స‌రిపెట్టుకోవాల్సిందే. వేస‌వి ఆరంభం ఆ చిత్రాల హ‌వానే క‌నిపిస్తుంది. ఇందులో త‌మిళ‌.. మ‌ల‌యాళ సినిమాల గురించే చెప్పుకోవాలి.

ఇటీవ‌లే 'ప్రేమ‌లు' అనే మాలీవుడ్ చిత్రం తెలుగులో రిలీజ్ అయి మంచి టాక్ ద‌క్కించుకుంది. స‌క్సెస్ దిశ‌గా అడుగులు వేస్తోంది. దీంతో ఈనెల‌ఖ‌రును పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన 'ది గోట్ లైఫ్' రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు భారీ అంచ‌నాలు పెంచేసాయి. య‌ధార్ధ సంఘ‌ట న‌లు ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఈనెల 28న రిలీజ్ అవుతుంది.

ఇక చియాన్ విక్ర‌మ్ న‌టిస్తోన్న 'తంగ‌లాన్' బారీ అంచానాల మ‌ధ్య రిలీజ్ కి రెడీ అవుతోంది. విశాల్-హ‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ర‌త్నం కూడా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతుంది. ఇదే నెల తొలి వారంలో 'మంజుమ్మెల్ బాయ్స్' అనే మ‌ల‌యాళ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రా న్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేయ‌డం విశేషం. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న 'వెట్టేయాన్' కూడా వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసుకుని వేస‌విలోనే రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

టి.జె జ్ఞాన్ వేల్ ఈ చిత్రాన్ని కూడా స‌మాజంలో అస‌మాన‌తల నేప‌థ్యంలో త‌న‌దైన మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లుస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ న‌టించ‌డంతో ఆ సందేశం ప్ర‌జ‌లంద‌రికీ మ‌రింత రీచ్ అవ‌కాశం ఉంది. అమితాబ‌చ్చ‌న్..ప‌హాద్ పాజ‌ల్.. రానా లాంటి స్టార్లు ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. అలాగే '96' ఫేం ప్రేమ్ కుమార్ కార్తీ హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో తెర‌కె క్కుతోన్న‌ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ఈ చిత్రాన్ని వేస‌విలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ తేదీపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. ఇండి యాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా 'ఇండియన్-2' కూడా ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉన్న సినిమా మేలో రిలీజ్ అవుతుంది.