Begin typing your search above and press return to search.

2024 నాన్ స్టాప్ బాక్సాఫీస్ హీట్

ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఈ సంవత్సరం స్క్రీన్ మీద కనిపించలేదు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:30 AM GMT
2024 నాన్ స్టాప్ బాక్సాఫీస్ హీట్
X

ప్రతి వారం ఏదో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటుంది. నిజానికి ఒకటి కాదు, నాలుగైదు సినిమాలు ప్రతి శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అయితే, చిన్న సినిమాలు ఎన్ని వచ్చినా, ప్రేక్షకుల కళ్లన్నీ పెద్ద సినిమాల మీదే ఉంటాయి. ఈ ఏడాది పెద్దగా పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదనే చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఈ సంవత్సరం స్క్రీన్ మీద కనిపించలేదు.

దీంతో, వారి టార్గెట్ వచ్చే ఏడాది సమ్మర్ పైనే ఉంది. ఈ ముగ్గురు హీరోలు 2024ని టార్గెట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా రిజల్ట్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇచ్చినా, మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కొంత అసంతృప్తి ఉంది. దీంతో, ఆయన సింగిల్ గా వస్తున్న దేవర కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల సమయంలో ఉగాది, రంజాన్ లాంటి పండగలు ఉండటంతో, మూవీకి కలసి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక, రామ్ చరణ్ కూడా చివరగా ఆర్ఆర్ఆర్ తో కనిపించాడు. ఈ మూవీతో చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. నార్త్ జనాలు కూడా రామ్ చరణ్ లుక్స్ కి పడిపోయారు. ఇప్పుడు ఆయన హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ గేమ్ ఛేంజర్ కూడా 2024 సమ్మర్ కి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది..

పుష్ప మూవీతో ఐకాన స్టార్్ గా మారిన హీరో అల్లు అర్జున్. రీసెంట్ గానే ఆయనకు ఆ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దాని సీక్వెన్స్ పుష్ప2 పై మరింత ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్ల తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వీరి సినిమాలు మాత్రమే కాదు, తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో సూర్య తన కంగువా సినిమాని ఏప్రిల్ 12న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీ సైతం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా సమ్మర్ లో నే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంత మంది స్టార్స్ ఒకేసారి బాక్సాఫీసు మీద యుద్ధానికి రెడీ అవుతున్నారు. మరి అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.