Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్‌ అప్డేట్‌ : 2024 ఫస్ట్‌ ఫ్రైడే అలా అలా..!

ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా జనాల దృష్టిని ఆకర్షించలేక పోయింది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 7:55 AM GMT
బాక్సాఫీస్‌ అప్డేట్‌ : 2024 ఫస్ట్‌ ఫ్రైడే అలా అలా..!
X

తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రతి శుక్రవారం ఒకటికి మించిన సినిమాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వారం కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్దకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా జనాల దృష్టిని ఆకర్షించలేక పోయింది.

2024 మొదటి శుక్రవారం అవ్వడంతో ఏం సినిమాలు వస్తాయా అంటూ ఎదురు చూసిన ప్రేక్షకుల ముందుకు డబుల్‌ ఇంజిన్‌, ప్రేమ కథ మరియు రాఘవ రెడ్డి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల గురించి కూడా ఇంతకు ముందు విన్నట్లుగా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరో వారం రోజుల్లో సంక్రాంతి కానుకగా నాలుగు పెద్ద సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. ఆ కారణంగా ఏడాది మొదటి శుక్రవారం ను చాలా మంది క్రేజీ హీరోలు, స్టార్‌ హీరోలు లైట్‌ తీసుకున్నారు. అలా అలా ఉన్న సినిమాలు ఈ ఫస్ట్ ఫ్రైడే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబో మూవీ గుంటూరు కారం విడుదల అవ్వబోతుంది. అంతే కాకుండా నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా, వెంకటేష్ నటించిన సైంధవ్‌, తేజ సజ్జ 'హనుమాన్‌' సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

ఈ వారానికి సలార్ సినిమాతో పాటు హాయ్ నాన్న, డెవిల్‌ సినిమాలతో ప్రేక్షకులు సరి పెట్టుకోవాల్సిందే. వచ్చే వారం అసలైన సినిమాల జాతర మొదలు అయ్యి ఏడాదికి శుభ ఆరంభం ఇస్తుందని అంతా ఆశిద్దాం