బోయపాటి కూడా వాళ్ల సరసన చేరాడోచ్..!
అఖండ 2 రెమ్యునరేషన్స్ కోసమే 80 నుచి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. అఖండ 2 సినిమా 180 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్.
By: Tupaki Desk | 21 Feb 2025 10:30 PM GMTటాలీవుడ్ లో ఉన్న మాస్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ అందిస్తూ బోయపాటి చేసే సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇక బాలయ్య బోయపాటి కలిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గాను ఆయన మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య స్టార్ హీరోలే కాదు స్టార్ డైరెక్టర్స్ కూడా భారీ ఛార్జ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసే డైరెక్టర్స్ అయితే రెమ్యునరేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. హీరోలకు ఈక్వల్ కాకపోయినా డైరెక్టర్స్ లో ది బెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను ఆ సినిమాకు గాను 35 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
అఖండ తో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఆ నెక్స్ట్ రాం తో స్కంద తీసి ఫ్లాప్ చవి చూశాడు. అయినా కూడా అఖండ 2 తో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఈ సినిమా కథ బాగా కుదరడం పాన్ ఇండియా రిలీజ్ కు కావాల్సినంత సపోర్ట్ దొరకడంతో బోయపాటి కూడా బాగానే గుంజేస్తున్నాడని తెలుస్తుంది. అఖండ 2 కి బాలయ్య రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అఖండ 2 రెమ్యునరేషన్స్ కోసమే 80 నుచి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. అఖండ 2 సినిమా 180 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఐతే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాక్. సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే డిజిటల్, శాటిలై ఇంకా హిందీ రిలీజ్ రైట్స్ ద్వారానే హ్యూజ్ అమౌంట్ వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. ఇక బోయపాటి రెమ్యునరేషన్ కూడా 35 కోట్లని తెలుస్తుండగా అదే నిజమైతే పాన్ ఇండియా డైరెక్టర్స్ రెమ్యునరేషన్ సరసన బోయపాటి కూడా చేరినట్టే లెక్క. అఖండ 2 అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం బోయపాటి కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.