Begin typing your search above and press return to search.

అఖండ 2 - టైటిల్ తోనే కిక్కిచ్చిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరి కలయికలో సినిమా వస్తోంది అంటే మాస్ ఆడియెన్స్ కు పండగే అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:49 AM GMT
అఖండ 2 - టైటిల్ తోనే కిక్కిచ్చిన బోయపాటి
X

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కలయికలో సినిమా వస్తోంది అంటే మాస్ ఆడియెన్స్ కు పండగే అని చెప్పాలి. గూస్ బంప్స్ ఇచ్చే మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో బోయపాటి స్టైలే వేరు. ఇక ఈ ఇద్దరు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సింహా, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఈ ద్వయం మరోసారి జతకట్టడం సినిమావర్గాల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.


ముఖ్యంగా అఖండ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ భాషలో కూడా గొప్ప విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి కలిసిన అఖండ 2 ద్వారా, పాన్-ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట మరియు గోపీ అచంట నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్టును ప్రెజెంట్ చేస్తున్నారు. అఖండ కథకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను చాలా బలంగా అఖండ 2 గా ఫిక్స్ చేశారు.

అఖండ 2 టైటిల్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోస్టర్‌లోని గంధర్వతత్వం ప్రేక్షకులను బలంగా ఆకర్షిస్తోంది. టైటిల్ ఫాంట్‌లో శివలింగం మరియు క్రిస్టల్ లింగం బొమ్మలు కలగలిపి శక్తి-ఆధ్యాత్మికతలను ప్రతిబింబించాయి. అలాగే, పోస్టర్‌కు జోడించిన తాండవం అనే ట్యాగ్‌లైన్‌తోపాటు డమరుకం బొమ్మలు శివుడి శక్తిని సూచిస్తున్నాయి. వెనుక భాగంలో చూపించిన హిమాలయ పర్వతాలు ఈ సినిమా కథలో ఓ డివోషనల్ టచ్‌ను సూచిస్తున్నాయి.

బాలకృష్ణను పరిపూర్ణమైన పౌరాణిక శక్తితో తెరపై చూపించడంలో బోయపాటి శ్రీనుకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈసారి కూడా బాలయ్యకు తగిన పవర్‌ఫుల్ రోల్‌తో సార్వత్రిక ఆకర్షణ కలిగిన కథను బోయపాటి రూపొందించారని తెలుస్తోంది. అఖండ 2 అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది, ఇది వీరి కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమా కానుంది. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, సంగీత దర్శకుడు ఎస్. థమన్ మరోసారి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించేందుకు సి. రామప్రసాద్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు, ఇక ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన ఈ సూపర్ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ను చూస్తే అఖండ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రతి సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ సీక్వెల్‌లో మరింత ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ప్రేరణాత్మక సన్నివేశాలతో పాటు గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయమని చిత్రబృందం వెల్లడించింది. ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.