బాలీవుడ్ కి బోయపాటి వెళ్తే విధ్వంసమే!
ఇంత వరకూ బోయపాటి-బాలయ్య కాంబి నేషన్ ఫెయిలైంది లేదు అంటే? కారణం బోయపాటి ఎలివేషన్.
By: Tupaki Desk | 18 March 2025 12:00 AM ISTబోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు..ఎలివేషన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ లో కటౌట్ ఎలా ఉన్నా? ఎలివేషన్ తో హీరోని లేపడం అన్నది బోయపాటి స్పెషలిస్ట్. అందుకే బాల య్యకు సెకెండ్ ఇన్సింగ్స్ లో ఓ కొత్త రకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. ఇంత వరకూ బోయపాటి-బాలయ్య కాంబి నేషన్ ఫెయిలైంది లేదు అంటే? కారణం బోయపాటి ఎలివేషన్.
'వినయ విధేయ రామ' లోనూ రామ్ చరణ్ ని అలాగే లేపాలని చూసారు కానీ పనవ్వలేదు. రామ్ తోనూ అలాంటి ఎలివేషన్ ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. అప్పటికే బోయపాటితో నాలుగైదు సినిమా చేసేయడంతో? తెలుగు ఆడియన్స్ కి బోయపాటి ఫార్ములా రొటీన్ గా మారిపోయింది. ఈ కారణంతోనే ఇతర హీరోలతో బోయపాటి స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇదే ఎలివేషన్ బోయపాటి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ హీరోకిస్తే పీక్స్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బోయపాటి మార్క్ సినిమాలు బాలీవుడ్ లో ఇంత వరకూ ఏ డైరెక్టర్ ప్రయత్నించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ తెలుగు మాస్ కంటెంట్ అక్కడ ఆడియన్స్ కి బాగా ఎక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలు...హీరో వన్ సైడ్ వార్ కి అక్కడ మాస్ బాగా కనెక్ట్ అవుతుంది. `పుష్ప` చిత్రం సక్సస్ అవ్వడానికి కారణంగా అదే. అలాగే `సరైనోడు` యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలవడానికి ప్రధాన కారణం కూడా అదే.
హీరోల మాస్ ఎలివేషన్ పాత్రలకు అక్కడ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన టైమ్. మాస్ ఇమేజ్ ...కటౌట్ ఉన్న హీరో ని పట్టుకుని బోయపాటి మార్క్ యాక్షన్ మార్క్ చిత్రం చేసాడంటే? దుమ్ముదులిపేస్తుందంటున్నారు.