Begin typing your search above and press return to search.

బోయ‌పాటి నెక్స్ట్ ఎవ‌రితో?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ తో బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న 'స్కంద' క్లైమాక్స్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Aug 2023 2:30 PM GMT
బోయ‌పాటి నెక్స్ట్ ఎవ‌రితో?
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ తో బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న 'స్కంద' క్లైమాక్స్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చివ‌రి పాట షూటింగ్ జ‌రుగుతుంది. ఇది పూర్త‌యితే చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యిన‌ట్లే. అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం అవుతాయి. దీంతో రామ్ పూర్తి స్థాయిలో 'డుబుల్ ఇస్మార్ట్ 'షూట్ లో బిజీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తిచేసిన పూరి జ‌గ‌న్నాధ్ రామ్ పూర్తిగా రంగంలోకి దిగితే వీలైనంత వేగంగా చుట్టేయాల‌ని చేస్తున్నారు.

ఇలా రామ్ షెడ్యూల్ బిజీగా ఉంది. మ‌రి బోయ‌పాటి ప‌రిస్థితి ఏంటి? నెల రోజుల్లో పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ చుట్టేసిన త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోల్ని లైన్ లోకి తెస్తారు? అంటే ఇంత‌వర‌కూ స‌రైన క్లారిటీ లేదు. దీంతో బోయ‌పాటి త‌దుప‌రి సినిమా ఏ హీరోతో చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం హీరోలంతా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. టైర్ వ‌న్ నుంచి టైర్ -2 హీరోల‌వ‌ర‌కూ అంతా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు.

డేట్లు దొర‌క‌క పాన్ ఇండియాలో హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కులే వెయిట్ చేయాల్సిన స‌న్నివేశం ఉంది. 'కార్తికేయ‌-2 'త‌ర్వాత చందు మొండేటి ఏడాదికి పైగానే ఖాళీగా ఉన్నారు. కొంత మంది హీరోలు క‌థ‌లు లాక్ చేసినా డేట్లు స‌ర్దుబాటు కుద‌ర‌క‌పోవ‌డంతో వీలుప‌డ‌లేదు. చివ‌రిగా నాగ‌చైత‌న్య‌తో కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తున్నారు. చందులా ఇంకా సక్సెస్ ఫుల్ మేక‌ర్స అంతా హీరోల చుట్టూనే తిరుగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌డానికి ఎంత స‌మ‌యం తీసుకుంటారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 'అఖండ‌'తో పాన్ ఇండియాలో వెలిగిపో యారు. ఆ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేస్తారు అన్న ప్ర‌చారం సాగింది. అది బ‌న్నీ సినిమా అవుతుంద‌ని భావించారు. క‌ట్ చేస్తే రామ్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించారు. మ‌రి హీరోలంతా ఇంత బిజీగా ఉన్న నేప‌థ్యంలో బోయ‌పాటికి ఏ హీరో వేగంగా డేట్లు ఇస్తారు? అన్న‌ది చూడాలి.