స్ట్రాంగ్ విలన్ కోసం బోయపాటి వేట
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నా కూడా అందులో టాప్ లిస్టులో ఉండే కాంబో బాలకృష్ణ-బోయపాటి శ్రీను.
By: Tupaki Desk | 29 May 2024 10:30 AM GMTటాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నా కూడా అందులో టాప్ లిస్టులో ఉండే కాంబో బాలకృష్ణ-బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100% బాక్సాఫీస్ హిట్ అనేలా సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ విజయాలు నందమూరి అభిమానులను గర్వపడేలా చేశాయి.
ఇప్పుడు, ఈ విజయవంతమైన కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో "NBK 109" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఎన్నికల కారణంగా బ్రేక్ తీసుకున్న బాలకృష్ణ త్వరలో సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ-బోయపాటి కలయికలో అఖండ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది.
అసలైతే అఖండ తరువాతే వెంటనే ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ బాలయ్య బిజీ కావడంతో బోయపాటి రామ్ తో స్కంద సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. అయితే ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు సంబంధించిన ఒక టాక్ వైరల్ అవుతోంది. సినిమాకు సంబంధించిన ప్రతినాయకుడి ఎంపికపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయని టాక్ వస్తోంది.
బాలకృష్ణ గత రెండు చిత్రాల్లో బాలీవుడ్ విలన్లు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ లను తీసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా సంజయ్ దత్ ను ప్రతినాయకుడిగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, సంజయ్ దత్ ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల డేట్లు దొరకడం కష్టంగా ఉంది. సంజయ్ దత్ అందుబాటులో లేకపోతే, బోయపాటి ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నారు.
అఖండలో సీనియర్ హీరో శ్రీకాంత్ తో చేసిన విధంగా, ఈ సారి కూడా కొత్త నటుడితో సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇదే తరహాలో విలనిజం ఆశిస్తున్నారు. ఇక బోయపాటి శ్రీనుకి "స్కంద" తర్వాత మంచి హిట్ అవసరం. ఈ సారి పొలిటికల్ టచ్ కాస్త ఎక్కువగా ఉంటుందని సమాచారం. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే, సినిమా పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నారు. ఈ కొత్త కాంబినేషన్, అఖండ 2 రూపంలో, టాలీవుడ్ లో మరిన్ని రికార్డులు సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.