Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ లుక్‌: `బ్ర‌హ్మ ఆనందం` ఎక్క‌డా త‌గ్గేదేలే

బ్ర‌హ్మీ అంటే మ‌హ‌దానందం. ఆయ‌న‌ను చూస్తేనే అంద‌రికీ ఆనందం.

By:  Tupaki Desk   |   16 Aug 2024 11:14 AM GMT
ఫ‌స్ట్ లుక్‌: `బ్ర‌హ్మ ఆనందం` ఎక్క‌డా త‌గ్గేదేలే
X

బ్ర‌హ్మీ అంటే మ‌హ‌దానందం. ఆయ‌న‌ను చూస్తేనే అంద‌రికీ ఆనందం. అభిమానుల‌కు ఎన‌లేని ఆనందాన్నిచ్చే మేటి న‌టుడు. అత‌డిపై ఫ్యాన్స్ కు అంతులేని ప్రేమాభిమానాలు. 1987లో `అహ‌నా పెళ్లంట` సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్ర‌హ్మానందం ఆ త‌ర్వాత ఇంతింతై అన్న చందంగా ఎదిగి, నేడు ఇంత‌టి సంచ‌ల‌నంగా మార‌తాడ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. బ్ర‌హ్మానందం ఏజ్ లెస్ స్టార్ అన‌డానికి తాజాగా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ఒక ఎగ్జాంపుల్.


డా.బ్రహ్మానందం న‌టించిన త‌దుప‌రి చిత్రం `బ్రహ్మ ఆనందం` త్వ‌ర‌లో విడుద‌లకు రానుంది. ఈ చిత్రంలో బ్ర‌హ్మీతో పాటు ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్ కూడా న‌టించారు. ఆస‌క్తిక‌రంగా ఆ ఇద్ద‌రూ తాత మనవళ్లుగా క‌నిపిస్తారు. చ‌క్క‌ని వ్యంగ్యం చ‌తుర‌త‌, కామెడీ ఇవ‌న్నీ ఈ పాత్ర‌ల్లో క‌నిపిస్తాయి. బ్రహ్మానందం ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఆయ‌న‌లో కామిక్ టైమింగ్ ఎక్క‌డా మిస్ కాలేదు. ఈ పోస్ట‌ర్ లో బ్ర‌హ్మీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా పంచెక‌ట్టులో క‌నిపించారు. సంక్రాంతి అల్లుడులా జెరీ అంచు సిల్కు చొక్కా తొడుక్కుని షేడ్స్ ధ‌రించి ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. తెల్ల పంచె గోల్డ్ చొక్కా అద్భుతంగా కుదిరాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అతను ఇంట్లోకి రాజాలా ప్ర‌వేశిస్తున్న‌ట్టు కనిపిస్తోంది.

మ‌రోసారి బ్ర‌హ్మీలోని కామిక్ కోణాన్ని ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు. పోస్ట‌ర్ ఆస‌క్తిని పెంచింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ కథానాయికలు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.