వైరల్... రాజకీయ నాయకుడిపై బ్రహ్మానందం కామెంట్స్!
టాలీవుడ్ హాస్యనటుడు, మీమ్స్ బ్రహ్మ, బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో.
By: Tupaki Desk | 14 Feb 2025 7:10 AM GMTటాలీవుడ్ హాస్యనటుడు, మీమ్స్ బ్రహ్మ, బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 1200కు పైగా చిత్రాల్లో నటించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం "బ్రహ్మా ఆనందం" తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో ఇటీవల ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బ్రహ్మానందం అలరిస్తున్నారు. ఈ రోజు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మ ఆనందం సినిమా సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడి గురించి ఆయన ఒక కామెంట్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది.
అవును... ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తాను చేస్తున్న సినిమాను ప్రమోట్ చేస్తూ.. తన అనుభవాలను రంగరించి పలు సూచనలు చేస్తూ, విలువైన విషయాలు చెబుతున్నారు బ్రహ్మానందం. ఈ సమయంలో తాజాగా చంద్రుడి వెన్నెలను, సముద్ర కెరటాలనూ కంపేర్ చేస్తూ ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుడు, ప్రజలు / కార్యకర్తలకు మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.
ఇందులో భాగంగా... "చంద్రుడు తన వెన్నెల ఉపన్యాశాలతో సముద్ర తరంగాలను రెచ్చగొడతాడు.. అంటే.. పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంది పోతుందంటాం కదా అలా.. కానీ తను (చంద్రుడు) మాత్రం తారలను తన చుట్టూ పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఉపన్యాశం ఇవ్వగానే.. మన కుర్రాళ్లు వెళ్లి అవి తగుల బెట్టి, ఇది చేసి, కిరసనాలు ఒంటిపై పోసుకుని తగలబడి.. వాళ్లను అలా రెచ్చగొడతాడు.. తాను మాత్రం తన పొజిషన్, చుట్టూ తన మంత్రుల పొజిషన్ తో హ్యాపీగా ఉంటాడు" అని అన్నారు.
ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పలు సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.