Begin typing your search above and press return to search.

హాస్య బ్రహ్మతో శేఖర్ కమ్ముల చుట్టరికం..!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం లేటెస్ట్ గా ఒక సినిమా ఈవెంట్ లో ఒక స్టార్ డైరెక్టర్ కు తనకు ఉన్న రిలేషన్ ని బయట పెట్టారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 9:30 PM GMT
హాస్య బ్రహ్మతో శేఖర్ కమ్ముల చుట్టరికం..!
X

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం లేటెస్ట్ గా ఒక సినిమా ఈవెంట్ లో ఒక స్టార్ డైరెక్టర్ కు తనకు ఉన్న రిలేషన్ ని బయట పెట్టారు. ఆయన కావాలని చెప్పలేదు అలా ఫ్లోలో వచ్చేసింది. ఆ స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసే స్థాయికి వెళ్లాడు. అతనెవరో కాదు సక్సెస్ ఫుల్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆనంద్ సినిమాతో మొదలైన శేఖర్ కమ్ముల ప్రస్థానం తెలిసిందే.

సెన్సిబుల్ సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఐతే అతనితో తనకున్న ఫ్యామిలీ రిలేషన్ ని అనుకోకుండా బయట పెట్టారు బ్రహ్మానందం. తనయుడితో ఒక సినిమా చేసిన బ్రహ్మానందం ఆ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో రాజా గౌతం గురించి చెబుతూ శేఖర్ కమ్ముల గోదావరి గౌతం తో తీయాలని కథ చెప్పాడు. ఐతే అది హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ఉందని గౌతం వద్దన్నాడని చెబుతూ శేఖర్ కమ్ములను తాను కమ్ముల శేఖర్ అని పిలుస్తా అని అతను నా భార్య మేనల్లుడు అంటూ షాక్ ఇచ్చారు బ్రహ్మి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనకు మేనల్లుడు వరుస అవుతాడని ఎప్పుడూ బ్రహ్మానందం రివీల్ చేయలేదు. అసలు వాళ్లిద్దరు కలిసి పనిచేసిన సందర్భం కూడా లేదు. ఐతే బ్రహ్మానందం శేఖర్ కమ్ముల ప్రస్తావన తీసుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బ్రహ్మానందం తనయుడు కెరీర్ లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈసారి బ్రహ్మానందం కూడా అతనికి ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు. ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమధ్య చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తనయుడు కోసం సినిమా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడని తెలుస్తుంది. బ్రహ్మి కామెడీ చేస్తే ఆ లెక్క ఎలా ఉంటుందో కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. మరి ఈసారి తనయుడితో కలిసి చేస్తున్న ఈ అటెంప్ట్ ఏమవుతుందో చూడాలి. బ్రహ్మానందం నటించిన ఇదివరకు సినిమాల్లోని సీన్స్ ని వాడుతూ మీమర్స్ బాగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. బ్రహ్మానందం ఇంకా మరిన్ని సినిమాలు చేస్తే వారికి కూడా కొత్త కంటెంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది.