Begin typing your search above and press return to search.

జీవితంలో ఒక్క‌సారైనా క‌మ‌ల్ హాస‌న్‌లా చేయాలి: హాస్య బ్ర‌హ్మీ

ఆయ‌న‌ను చూసే ఏ ఆర్టిస్టు అయినా కానీ, జీవితంలో ఒక్క‌సారైనా క‌మ‌ల్ హాస‌న్‌లా చేయాలి.

By:  Tupaki Desk   |   8 July 2024 4:17 AM GMT
జీవితంలో ఒక్క‌సారైనా క‌మ‌ల్ హాస‌న్‌లా చేయాలి: హాస్య బ్ర‌హ్మీ
X

శ‌రీరంలో ఏ భాగం న‌టించాలో ఆ భాగంతో న‌ట‌న చూపించే ఏకైక న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.. ఆయ‌న లాంటి న‌టుడు కేవ‌లం సౌతిండియాలోనే కాదు ఇండియాలోనే లేరు! అని అన్నారు సీనియ‌ర్ హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం. లెజెండ్ బ్ర‌హ్మానందం భార‌తీయుడు 2 ప్రచార వేదిక‌పై త‌న ఎదుట ఉన్న విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ని పైవిధంగా ప్ర‌శంసించారు. ఆయ‌న ఎదుటే ఉన్నారు క‌దా! అని అతిశ‌యోక్తిగా అన‌డం లేద‌ని, తాజ్ మ‌హ‌ల్ ఎదుటే ఉంటే అందంగా ఉంద‌ని అంటాం. ఈఫిల్ ట‌వ‌ర్ ఎదుటే క‌నిపిస్తే ఎంతో ఎత్తుగా ఉంద‌ని అంటాం. అలాగే క‌మ‌ల్ హాస‌న్ ఎదుటే ఉంటే ఆయ‌న‌ను పొగ‌డ‌కుండా ఉండ‌కూడ‌దు అని కూడా అన్నారు బ్ర‌హ్మానందం. నేను చ‌దువ‌కునే రోజుల నుంచి క‌మ‌ల్ హాస‌న్ ని చూస్తున్నాను. ఆయ‌న ఏజ్ ఎంతో కూడా నాకు తెలీదు అని కూడా బ్ర‌హ్మానందం అన్నారు.

ఆయ‌న‌ను చూసే ఏ ఆర్టిస్టు అయినా కానీ, జీవితంలో ఒక్క‌సారైనా క‌మ‌ల్ హాస‌న్‌లా చేయాలి. ఆయ‌న లాంటి పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుని పెర్ఫామ్ చేయాలి అనుకుంటార‌ని కూడా బ్ర‌హ్మానందం అన్నారు. ఇక మేక‌ప్ కోసం ఆయ‌న ఆరేడు గంట‌లు పైగా కేటాయిస్తుంటారు. అది పెయిన్ ఫుల్ గా ఉన్నా భ‌రిస్తారు. అది తాను ఎంపిక చేసుకున్న పాత్ర కోసం క‌మిట్ మెంట్. జీవితంలో ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. ఆయ‌న మెప్పించ‌ని పాత్ర లేదు. భార‌తీయుడు 2లో ఆయ‌న న‌టించిన పాత్ర‌ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని బ్ర‌హ్మానందం అన్నారు.

ఇదే వేదిక‌పై క‌మ‌ల్ హాస‌న్ గొంతును అనుక‌రిస్తూ బ్ర‌హ్మానందం మిమిక్రీ చేసిన తీరు అహూతుల‌ను ఆక‌ట్టుకుంది. తాను ఏఎన్నార్, ఎన్టీఆర్ ల‌ను ఇమ్మిటేట్ చేసేవాడిన‌ని, క‌మ‌ల్ హాస‌న్ ని కూడా ఇమ్మిటేట్ చేసి స‌క్సెస‌య్యాన‌ని కూడా బ్ర‌హ్మీ తెలిపారు. క‌మ‌ల్ హాస‌న్ వాయిస్ ని య‌థాత‌థంగా అనుక‌రిస్తూ బ్ర‌హ్మీ వేదిక‌పై గొప్ప మ్యాజిక్ చేసారు. ఆయ‌న లెజెండ‌రీ న‌టుడిని ఇమ్మిటేట్ చేస్తూ ఉంటే ఎదుటే ఉన్న‌ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ ఎంతో ఆశ్చ‌ర్యంగా చూసారు. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా, బ్ర‌హ్మానందం, కాజ‌ల్, సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ త‌దిత‌రులు న‌టించిన భార‌తీయుడు 2 జూలై 12న విడుద‌ల కానుంది.