Begin typing your search above and press return to search.

హాస్య‌బ్ర‌హ్మా పెళ్లి వెనుక చాలా క‌థే ఉందే!

ప్ర‌స్తుతం హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం ప‌రిమితంగానే సినిమాలు చేస్తున్నారు. న‌చ్చిన పాత్ర‌లు వ‌స్తే చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:30 PM GMT
హాస్య‌బ్ర‌హ్మా పెళ్లి వెనుక చాలా క‌థే ఉందే!
X

ప్ర‌స్తుతం హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం ప‌రిమితంగానే సినిమాలు చేస్తున్నారు. న‌చ్చిన పాత్ర‌లు వ‌స్తే చేస్తున్నారు. లేక‌పోతే కాల‌క్షేపమంతా ఇంట్లోనే. ఇప్ప‌టికే వంద‌ల చిత్రాల్లో న‌టించారు. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థానాన్ని సంపాదించారు. కెరీర్ లో ఎన్నో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న‌లో హిడెన్ ట్యాలెంట్ ని కూడా బ‌య‌ట‌కు తీస్తున్నారు.

చిత్ర‌లేఖ‌నం క‌ళ‌ని కూడా ఇటీవ‌ల బ‌య‌ట‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌రకాల బొమ్మ‌లు గీసి ప్రేక్ష‌కుల్ని ఆ ర‌కంగానూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌లే బ్ర‌హ్మానందం ఆయ‌న ఆత్మ‌క‌థ‌ని కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. `నేను -మీ బ్ర‌హ్మానందం` టైటిల్ తో ఆ పుస్త‌కాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఇందులో ఆయ‌న జీవితానికి సంబంధించిన‌..వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలు పంచుకున్నారు.

అందులో ఒక‌టి బ్ర‌హ్మానందం పెళ్లి అంశం. ఇందులో ఆయ‌న పెళ్లి ఎలా జ‌రిగింది? అన్న‌ది రివీల్ చేసారు. బ్ర‌హ్మానందం సినిమాల్లోకి రాక‌ముందు లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి రోజుల్లో ఎన్నో క‌ష్టాన‌ష్టాలు చూసి చ‌దువుకుని లెక్చ‌ర‌ర్ ఉద్యోగం సంపాదించారు. అత్తిలిలో లెక్చ‌ర‌ర్ గా ప‌నిచేసారు. దీంతో ఇంట్లో త‌ల్లిదండ్రులు మంచి సంబంధం..అర్దికంగా అన్నిర‌కాలుగా స‌హ‌కారం ఉన్న సంబంధం చేయాల‌ని చూసారుట‌.

కానీ చ‌దువు విష‌యంలో బ్ర‌హ్మానందంకి అన‌సూయ‌మ్మ అనే ఆవిడ స‌హాయం చేసారుట‌. ఆవిడే బ్ర‌హ్మానందం కోసం ఓ సంబంధం తెచ్చారుట‌. ఆమె భ‌ర్త‌ల చెల్లెళ్ల‌లో ఒక‌రైన ల‌క్ష్మిని బ్ర‌హ్మానందం పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని ఆవిడ ప్లాన్ చేసారుట‌. అందుకు బ్ర‌హ్మానందం కూడా ఒప్పుకున్నారుట‌. అప్ప‌టికే ల‌క్ష్మి బ్ర‌హ్మానందంకి తెలియ‌డంతో ఒప్పుకున్నారుట‌. ఇదే విష‌యం బ్ర‌హ్మానందం ఇంట్లో చెబితే కులాంత‌ర వివాహమ‌ని ఒప్పుకోలేదుట‌. ఒప్పించాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా ఒప్పుకోక పోయేస‌రికి...జీవితంలో పెళ్లే చేసుకోను అని బ్ర‌హ్మానందం భీష్మించుకుర్చున్నారుట‌. అప్పుడు త‌ల్లిదండ్రులు దిగొచ్చి వివాహానికి ఒప్పుకున్న‌ట్లు...1977 డిసెంబ‌ర్ 17న ల‌క్ష్మితో వివాహం జ‌రిగిన‌ట్లు రాసుకొచ్చారు.