Begin typing your search above and press return to search.

హాస్య బ్రహ్మి.. లైనప్ లో బడా సినిమాలు!

ఆ సినిమాలో కమెడియన్ గానే బ్రహ్మి సందడి చేస్తారని తెలుస్తోంది. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   31 May 2024 5:31 AM GMT
హాస్య బ్రహ్మి.. లైనప్ లో బడా సినిమాలు!
X

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న బ్రహ్మానందం సినిమాల పరంగా కూడా గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఒకానొక దశలో టాలీవుడ్ లో బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కాలంతో పాటు వయస్సు రీత్యా బ్రహ్మానందం సినిమాల సంఖ్య తగ్గించుకున్నారు.

స్టార్ హీరోలతో మూవీస్ చేస్తోన్న దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలు చేస్తున్నారు. కమర్షియల్ జోనర్ లో మల్టీపుల్ లేయర్స్ ఉండే కథలు ప్రస్తుతం తెలుగులో పెద్దగా రావడం లేదు. అందుకే బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో సందడి చేస్తోన్న గెస్ట్ అప్పీరియన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు.

బ్రహ్మానందం పూర్తి నిడివిలో కనిపించిన సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో బ్రో, రంగమార్తాండ, కీడాకోలా సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది రాబోతున్న చాలా సినిమాలలో ఆయన కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కొడుకు గౌతమ్ తో కలిసి హాస్యబ్రహ్మి మళ్ళీ తెరపై కామెడీ పండించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్ళింది.

అలాగే కల్కి 2898ఏడీ సినిమాలో బ్రహ్మానందం ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నారంట. అయితే ఈ పాత్ర ఏంటనేది చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. యానిమేటెడ్ సీరీస్ లో కూడా ఆయన ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నట్లు సమాచారం. మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ కన్నప్పలో కూడా బ్రహ్మానందం నటిస్తున్నారు.

ఆ సినిమాలో కమెడియన్ గానే బ్రహ్మి సందడి చేస్తారని తెలుస్తోంది. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలలో కూడా బ్రహ్మానందం నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ రాజాసాబ్ మూవీలో ఓ పాత్రలో కనిపించబోతున్నారంట. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

టాలీవుడ్ లో ఎంత మంది కమెడియన్స్ వచ్చిన బ్రహ్మానందంన్నీ రీప్లేస్ చేయలేరు. ఆయన చేసే పెర్ఫార్మెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. సరైన పాత్ర పడితే బ్రహ్మానందం తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తారని కీడాకోలా మూవీతో గత ఏడాది ప్రూవ్ చేశారు. బ్రహ్మానందం ప్రస్తుతం ఇతర భాష సినిమాలలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.