నెవ్వర్ బిఫోర్ భ్రమ యుగం.. తెలుగులో ఎప్పుడంటే?
కొందరు నటులు భాష, ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు
By: Tupaki Desk | 19 Feb 2024 12:42 PM GMTకొందరు నటులు భాష, ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆయన నటించిన మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే ఆయన లేటెస్ట్ మూవీ భ్రమ యుగం అందరి దృష్టిని ఆకర్షించింది.
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్- థ్రిల్లర్ భ్రమ యుగం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించిన ఈ సినిమాకు సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. స్టోరీ కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ, యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందట.
ఈ నేపథ్యంలో భ్రమ యుగం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 23వ తేదీన సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుందని తెలిపారు. "లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి బ్లాక్ బస్టర్ మూవీ భ్రమ యుగం.. ఏపీ, తెలంగాణలో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23 నుంచి మీకు దగ్గరలో ఉన్న థియేటర్ కు వెళ్లి నెవ్వర్ బిఫోర్ హారర్ ఎక్స్పీరియన్స్ పొందండి" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
భ్రమ యుగం సినిమా తెలుగు ట్రైలర్ ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కచ్చితంగా వెళ్లి చూస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మలయాళం భాషలో ఇప్పటికే భ్రమ యుగం చిత్రాన్ని వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఇది ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని చెబుతున్నారు.
మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి నటనను ప్రేక్షకులుతోపాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. మూవీ యూనిట్ అంతా కష్టపడి పనిచేసి, సమష్టి కృషితో అద్భుతమైన అవుట్ పుట్ ను అందించారని సినీ పండితులు కొనియాడుతున్నారు.
సినిమా స్టోరీ లైన్ ఇదే
జానపద గాయకుడైన తేవన్ (అర్జున్ అశోకన్) తన తల్లిని కలవడానికి వెళ్తూ అడవిలో అనుకోకుండా దారి తప్పిపోతాడు. ఆకలితో ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఒక ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో అక్కడ మనక్కల్ కుడుమోన్ (మమ్ముట్టి)తోపాటు అతడి కొడుకు ఉంటారు. వెంటనే తేవన్ పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ వెళ్లలేకపోతాడు. మరి అతడి ఆ ఇంటి నుంచి బయటపడ్డాడా? అసలు కుడుమోన్ ఎవరు? అక్కడ ఎందుకున్నాడు? అనేది మిగతా సినిమా.