'కీడా కోలా'.. బ్రహ్మి రోల్ ఆయన చేసుంటే..
ఈ క్రమంలోనే ఆయన అల్లు అరవింద్ గురించి ఓ విషయాన్ని రివీల్ చేశారు. అదేంటంటే తన సినిమాలో మొదట బ్రహ్మానందం పాత్ర కోసం అరవింద్‌ను అనుకున్నట్లు చెప్పారు.
By: Tupaki Desk | 28 Oct 2023 6:27 AM GMT'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యూత్‌ను అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. చాలా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 'కీడా కోలా'తో రాబోతున్నారు. క్రైం కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమా విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అలా చేయకుండా ఉండాల్సింది అని అంతా మాట్లాడుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే?... ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఈ కీడా కోలా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అల్లు అరవింద్ గురించి ఓ విషయాన్ని రివీల్ చేశారు. అదేంటంటే తన సినిమాలో మొదట బ్రహ్మానందం పాత్ర కోసం అరవింద్‌ను అనుకున్నట్లు చెప్పారు. కానీ ఆయన నో చెప్పడంతో బ్రహ్మీని అప్రోచ్ అయినట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రియులు.. అల్లు అరవింద్ నో చెప్పకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా సార్లు స్టేజ్‌పై ఆయన తన మాటలతో నవ్విస్తుంటారు. చాలా ఏళ్ల క్రితమే చంటబ్బాయి చిత్రంలో ఆయన చేసిన పాత్ర కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కాబట్టి ఆయన మళ్లీ ఈ చిత్రం కోసం నటించి ఉంటే పక్కా ఆయన పాత్ర ఎంతో కొత్తగా, ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేది.
ఎలాగో బ్రహ్మీ అలాంటి పాత్రలు చేసి చేసి ఆడియెన్స్ అలవాటు పడిపోయారు. కాబట్టి అల్లు అరవింద్ చేసి ఉంటే.. తరుణ్ భాస్కర్ ఆయన్ను మరింత కొత్తగా ప్రజెంట్ చేసేవారు. పైగా నిర్మాతలు ఇలా సినిమాల్లో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇదంతా సినీ ప్రియులకు ఓ ప్రత్యేకంలా ఉండేది. సినిమాకు మరింత హైప్ కూడా క్రియేట్ అయ్యేది. కాబట్టి ఈ మెగా ప్రొడ్యూసర్ అయ్యో అనవసరంగా ఈ ఛాన్స్‌ను వదిలేశారే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.