కూతురు కోసం కోట్లు కాదనుకుని బ్రేక్..!
తన కూతురు రాహా తో సమయం గడపాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత కొత్త సినిమా ను కమిట్ అవ్వకుండా రణబీర్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
By: Tupaki Desk | 25 Oct 2023 11:09 AM GMTసినిమా ఇండస్ట్రీ కి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత బాగా సూట్ అవుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజ్ ఉన్న సమయం లోనే నాలుగు సినిమాలు చేసుకోవాలి... నాలుగు సినిమాలు హిట్ అయినప్పుడే పారితోషికం మూట కట్టుకోవాలి. కానీ కొందరు మాత్రం ఆ సూత్రం ను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేస్తూ ఉంటారు.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో బ్రేక్ తీసుకున్న వారు ఉన్నారు.. వరుసగా భారీ పారితోషికం తో ఆఫర్లు వస్తున్న సమయంలో నో చెప్పిన వారు ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలో బాలీవుడ్ యంగ్ స్టార్ రణబీర్ కపూర్ చేరబోతున్నాడు. ఏకంగా ఆరు నెలల సమయం బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు అనడం లో సందేహం లేదు. ఒకొక్క సినిమాకు కోట్ల పారితోషికం తీసుకునే రణబీర్ కపూర్ ఇలా బ్రేక్ తీసుకోవడం చాలా మందికి ఆశ్చర్యం ను కలిగిస్తుంది.
తన కూతురు రాహా తో సమయం గడపాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత కొత్త సినిమా ను కమిట్ అవ్వకుండా రణబీర్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహా పుట్టి ఏడాది అవుతోంది. ఈ ఏడాది లో రణబీర్ కపూర్ ఎప్పుడూ కూడా బిజీగా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఉండటం వల్ల తనతో ఎక్కువ సమయం గడపలేక పోయాడట.
ఈ విషయాన్ని రణబీర్ కపూర్ తెలియజేస్తూ... రాహా ఇప్పుడు ప్రేమను వ్యక్త పరుస్తోంది. తను చాలా విషయాలను గుర్తించడం తో పాటు మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇప్పుడు తనతో ఎక్కువ సమయం గడపడటం వల్ల తన యొక్క ప్రేమను పూర్తిగా ఆస్వాదించవచ్చు అనుకుంటున్నాను. నా యొక్క సమయం పూర్తిగా తనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అన్నాడు.
రణబీర్ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సందీప్ వంగ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ గత చిత్రాలు నిరాశ పరిచినా కూడా ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.