కొత్త లవ్ స్టోరీకి అమ్మడు మంగళం పాడేసిందా?
తాజాగా శ్రద్దా కపూర్ , రాహుల్ సహా అతడి ఫ్యామిలీ మెంబర్ల అన్ని ఖాతాల్ని అన్ ఫాలో చేసింది.
By: Tupaki Desk | 5 Aug 2024 1:15 PM GMTబాలీవుడ్ లవ్ స్టోరీలు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇష్టమున్నంత కాలం కలిసి ఉంటారు. తిరుగుతారు. ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ గామారితే వివాహం వరకూ వెళ్తారు. మధ్యలో ఎక్కడైనా తేడా జరిగితే సింపుల్ గా బ్రేకప్ తో దూరమవుతున్నారు. పెళ్లి చేసుకున్న జంటలకన్నా మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్న జోడీలిక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా విడిపోయిన లిస్ట్ లో శ్రద్దా కపూర్ ని కూడా మూడవ సారి చేర్చాలి అన్నట్లు గా గాలి వీస్తుంది.
గతేడాది రిలీజ్ అయిన 'తు ఝూతి మైన్ మక్కార్' సినిమా సమయంలో శ్రద్ధా కపూర్-రాహుల్ మోదీ మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాహుల్ రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమా తర్వాతి నుంచి శ్రద్ధా-రాహుల్ డేటింగ్ చేసినట్లు ప్రచారం మొదలైంది. అటుపై బాలీవుడ్‌లో జరిగిన ఈవెంట్లకు, పార్టీలకు వీరద్దరూ కలిసే హాజరయ్యారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి కూడా జంటగా హాజరయ్యారు.
దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని అందరూ అనుకున్నారు. అంతకు ముందు రాహుల్ పై మనసులో ఉన్న ప్రేమని ఇన్ స్టా రూపంలో ఎంతో అందంగా..అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేసింది శ్రద్దా. ఇది చూసి ఈసారి పెళ్లి ఖాయమనే అనుకున్నారు. కానీ ఇప్పుడా బంధం కూడా వీగిపోయింది. తాజాగా శ్రద్దా కపూర్ , రాహుల్ సహా అతడి ఫ్యామిలీ మెంబర్ల అన్ని ఖాతాల్ని అన్ ఫాలో చేసింది.
చివరికి ఆ ఇంట్లో డాగ్ పేరుతో ఉన్న ఖాతాని కూడా బ్లాక్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య సీరియస్ గా ఏదో డిస్కషనే జరిగి ఉంటుందని మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. నెల రోజుల క్రితం ఎంతో సంతోషంగా కనిపించిన జోడీ ఇప్పుడిలా అన్ ఫాలోతో రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది.