Begin typing your search above and press return to search.

బ్రో 3 రోజుల కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే?

ఆదివారం రోజు అయితే చాలా ఏరియాల లో హౌస్ ఫుల్ బోర్డులు అయితే దర్శనమిచ్చాయి.

By:  Tupaki Desk   |   31 July 2023 7:04 AM GMT
బ్రో 3 రోజుల కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంటోంది. ఈ సినిమా కు మొదట్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ హై వోల్టేజ్ ఎనర్జీకి ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా కు కాస్త అటు ఇటుగా నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కూడా ప్రభావం అయితే పెద్దగా సినిమా కలెక్షన్స్ పై పెద్దగా పడలేదు అని అర్థమవుతుంది.

సినిమా కు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు అయితే చాలా ఏరియాల లో హౌస్ ఫుల్ బోర్డులు అయితే దర్శనమిచ్చాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంది అనే వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మొత్తంగా మూడు రోజుల్లో బ్రో సినిమా 44.56 కోట్ల షేర్ కలెక్షన్స్ 52.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి ఈ సినిమా కు 4.85 కోట్లు దక్కాయి. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే మొత్తంగా అక్కడ నుంచి ఈ సినిమా కు 5.85 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 55.26 కోట్లు షేర్ కలెక్షన్స్ 91.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 97.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిని మొత్తం వెనక్కి తీసుకురావాలి అంటే ఇంకా 40 కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా అన్ని ఏరియాల నుంచి అయితే సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూడవరోజు కూడా చాలా ఏరియా లలో ఫ్యామిలీ అడియన్స్ ఎక్కువగా కనిపించారు.

హౌస్ ఫుల్ బోర్డులు కూడా ఎక్కువగానే కనిపించాయి కాబట్టి సినిమా కు నెగిటివ్ రివ్యూలు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు అని అర్థమవుతుంది. ఇక సోమవారం నుంచి కూడా కలెక్షన్స్ బాగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి బ్రో సినిమాతో ఈసారి సాయిధరమ్ తేజ్ కూడా తన ఖాతాలో మరో సక్సెస్ వేసుకున్నాడు అని చెప్పవచ్చు.