బ్రో డాడీ ఎవరు రిస్క్ చేయట్లేదు..?
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
By: Tupaki Desk | 12 Oct 2023 1:30 PM GMTఅదేంటో మళయాళంలో సెట్ అయినట్టుగా కథలు కానీ కాంబినేషన్స్ కానీ మిగతా భాషల్లో సెట్ అవ్వవు. అక్కడ కంటెంట్ ఉన్న సినిమాలైనా సరే మిగతా భాషల్లోకి వచ్చే సరికి కొంత కమర్షియల్ హంగులు అద్ది రీమేక్ చేస్తుంటారు. ఈమధ్య కాలంలో మలయాళం నుంచి చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ వెర్షన్ నే డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా రీమేక్ డిస్కషన్స్ లో ఉన్న ఒక సినిమాను మాత్రం తెలుగు మేకర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే బ్రో డాడీ అని తెలుస్తుంది. మలయాళ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా మలయాళ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
సినిమాలో మోహన్ లాల్, పృధ్వి రాజ్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆమధ్య చిరంజీవి సుస్మిత ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమా ఇదే అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదని తెలిసింది. ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ నే చిరంజీవి క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.
బ్రో డాడీ తెలుగు నేటివిటీకి తగినట్టుగా మంచి కాంబినేషన్ సెట్ చేస్తే తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది. ఇదే కాదు పృధ్వి రాజ్ సుకుమారన్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా తెలుగు రీమేక్ డిస్కషన్స్ దగ్గరే ఆగిపోయింది. అయితే ఈమధ్య రీమేక్ సినిమాల కన్నా ఒరిజినల్ కథలకే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే బ్రో డాడీ మూవీని ఎవరు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు.
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మాత్రం చిరుని రీమేక్ లు అసలు ఎంకరేజ్ చేయొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. చిరు రీమేక్ చేసిన గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు నిరాశ పరిచాయి. అందుకే చిరు కూడా ఇక మీదట రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. బ్రో డాడీ తెలుగులో ఎవరు చేస్తారు.. ఎవరిని పెడితే ఆ ప్రాజెక్ట్ కి క్రేజ్ వస్తుంది అన్నది సినిమా రీమేక్ రైట్స్ కొన్న నిర్మాతలు ఆలోచిస్తున్నారు.