Begin typing your search above and press return to search.

'బ్రో' నో ఛాలెంజెస్.. సైలెన్స్ ప్లీజ్

ఇతర హీరోల సినిమాల రికార్డులను పోల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేరని అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   28 July 2023 11:02 AM GMT
బ్రో నో ఛాలెంజెస్.. సైలెన్స్ ప్లీజ్
X

సాధారణంగా ఓ బడా హీరో సినిమా వచ్చిందంటే.. బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. సినిమా అనౌన్స్ మెంట్ మొదలు.. అది రిలీజై లాంగ్ రన్ టైమ్ కలెక్షన్లు పూర్తయ్యే వరకు.. ప్రతీ దాని గురించి చర్చ ఉంటుంది. మిగతా సినిమాలతో పోలుస్తూ గట్టి పోటీ వాతవరణం నెలకొంటుంటుంది. పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్.. ఇలా అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టిస్తుంటాయి. దాని గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు.

మరీ ముఖ్యంగా టాలీవుడ్ పవన్ కల్యాణ్ సినిమా వస్తే.. రికార్డు బద్దలవ్వాల్సిందేనన్న ధీమాతో ఉంటారు ఆయన అభిమానులు. కానీ ఈ సారి బ్రో సినిమా విషయంలో అలా కనపడట్లేదు. కాస్త సంయమనం పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎటువంటి ఛాలెంజెస్ చేయట్లేదు. ఇతర హీరోల సినిమాల రికార్డులను పోల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేరని అనిపిస్తుంది.

అందుకు కారణం.. తెలిసిన విషయమే. బ్రో సినిమాకు మొదటి నుంచి భారీగా హైప్ క్రియేట్ అవ్వలేదు. రిలీజైన మొదటి రెండు సాంగ్స్, టీజర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరిచాయి. పైగా ఈ సినిమా పవన్ ఇమేజ్ కు తగ్గట్టు మాస్ చిత్రం కాదు. మాస్ టచ్ కొంచమే ఇచ్చారు. క్లాస్ అండ్ సోషల్ మెసేజ్ టైప్ లాంటి చిత్రం.

అయినప్పటికీ సినిమా మొదటి రోజు కాబట్టి.. ఫ్యాన్స్ భారీగానే తరలివచ్చారు. దీంతో మంచి ఓపెనింగ్స్ ఒకవేళ వచ్చినా.. అది పవన్ స్టామినాకు తక్కువనే చెప్పాలి. పైగా బ్రో సినిమాకు ఉన్న పరిమితులు, ప్రతికూలతల దృష్ట్యా.. రికార్డుల విషయాన్ని ఆలోచించకపోవడమేనని అంటున్నారు అభిమానులు. మామూలుగా స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే వాటికి భారీగా రేట్లు పెంచుతారు. కానీ బ్రోకు అలా చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ ధరలే పెట్టారు. అలాగే ఈ చిత్రానికి భారీగా రిలీజ్ కూడా దక్కలేదని తెలిసింది.

రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమా బాగా ఆడుతోంది. బ్రో సినిమా వచ్చినప్పటికీ.. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లను ఇంకా కొనసాగిస్తున్నారట. అలానే మల్టీప్లెక్సుల్లోనూ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీ చిత్రాలను ప్రదర్శసిస్తన్నారట.

ఇక తాజాగా విడుదలైన హిందీ చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానికి కూడా హైదరాబాద్ లో స్క్రీన్లు బాగానే దక్కాయట. దీంతో బ్రోకు భారీ స్క్రీన్లు, షోలు దరొకలేదట. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యలోనూ తొలి రోజు సినిమా చూసేందుకు అభిమానులు భారీగానే తరలివచ్చారు. కానీ ఎంత కాదనుకున్నా.. ఇలాంటి పరిమితులు, ప్రతికూలతల నడుమ.. బ్రోను రికార్డుల వేటలో చూడకూడదని అనుకుంటున్నారట.