Begin typing your search above and press return to search.

బ్రో కలెక్షన్స్ గోల.. ఇది టూ మచ్!

సినిమా కలెక్షన్స్ సోమవారం తగ్గిపోవడంతో బ్రో సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది అనే విధంగా కథనాలు అల్లేస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:20 AM GMT
బ్రో కలెక్షన్స్ గోల.. ఇది టూ మచ్!
X

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఫస్ట్ మూవీ బ్రో సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. అది కూడా టికెట్ల రేట్లు ఎక్కువగా లేకపోవడం బెనిఫిట్ షోలు కూడా పడలేదు. అయినప్పటికీ కూడా బ్రో సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి.

ఇక ఆ తర్వాత శని ఆదివారాలు కూడా అదే ఫ్లో కొనసాగింది. ఆదివారం రోజు చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమా కలెక్షన్స్ సోమవారం తగ్గిపోవడంతో బ్రో సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది అనే విధంగా కథనాలు అల్లేస్తున్నారు.

ఇక్కడ ఎవరు ఆలోచించని చిన్న విషయం ఏమిటి అంటే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే సోమవారం రోజు కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంటాయి. అందులోనూ బ్రో సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ హడావిడి కూడా చేయలేదు. ఈ సినిమాను చాలా డీసెంట్ గానే విడుదల చేశారు. చాలా నార్మల్గా అంచనాలు ఉంటేనే ఇలాంటి కంటెంట్ జనాల్లోకి చాలా ఈజీగా వెళుతుంది అనే ఫార్ములానే చిత్ర యూనిట్ ఫాలో అయ్యింది.

ఇక సినిమాకు ఎంత రెస్పాన్స్ రావాలో అంత రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం వలన అతని సినిమాకు ఎప్పటిలానే ఓవర్గం నుంచి నెగిటివ్ వార్తలు రావడం కూడా కామన్ గా మారిపోయింది. ఇక బ్రో సినిమా కలెక్షన్స్ విషయంలో సోమవారం నెంబర్ల ను హైలెట్ చేస్తూ ఈ సినిమా భారీ నష్టాలు కలిగించే విధంగా ఉంది అన్నట్లు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

ఒక విధంగా ఈ సినిమాకు మరి అంత దారుణమైన రెస్పాన్స్ ఏమీ రావడం లేదు. ఫ్యాన్స్ మళ్ళీ రిపీటెడ్ గా వెళుతున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా మెల్లమెల్లగా మరింత దగ్గరవుతోంది. హాలిడేస్ లేని టైంలో అసలే వర్షాకాలంలో బ్రో సినిమా విడుదలయ్యింది. ఈ తరుణంలో ఈ తరహా రెస్పాన్స్ అందుకోవడం ఒక విధంగా గుడ్ అనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ బ్రో సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో మంచి రెస్పాన్స్ అందుకుంటుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.