బ్రో.. ఆ ఇద్దరు ఎందుకు రానట్టు?
హరీష్ శంకర్, క్రిష్ ఇద్దరూ కూడా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేరు
By: Tupaki Desk | 26 July 2023 4:01 AM GMTపవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో రాబోతోన్న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ తో సినిమాకి హైప్ పెరిగిపోయింది. జులై 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే అతనితో మూవీస్ చేస్తోన్న దర్శకులు కూడా వస్తూ ఉంటారు.
కానీ మొదటి సారి బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన దర్శకుడు హరీష్ శంకర్ కనిపించలేదు. హరీష్ శంకర్ పవన్ తో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
అయితే షూటింగ్ ఇంకా 80 శాతం వరకు కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.
మరో వైపు రెండేళ్ళ నుంచి హరిహర వీరమల్లు సినిమాని క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ మూవీకి మరో 30 నుంచి 40 రోజులు కాల్ షీట్స్ కేటాయిస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయితే డానికి ప్రయారిటీ ఇవ్వకుండా పవన్ బ్రో మూవీ కంప్లీట్ చేశారు.
అలాగే సుజిత్ దర్శకత్వంలో ఒజీ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ఈ విషయంలో క్రిష్ కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది.
హరీష్ శంకర్, క్రిష్ ఇద్దరూ కూడా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేరు. నిజానికి సుజిత్ కూడా ఈ ఈవెంట్ కి రాలేదు. అయితే అతను ఒజీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అందుకే రాలేదు. కాని హరీష్ శంకర్, క్రిష్ పరిస్థితి అది కాదు. పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీ ఈవెంట్ అంటే కచ్చితంగా హరీష్ శంకర్ అటెండ్ అవుతారు. కాని బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గోనకపోవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
మరి ఆ ఇద్దరు దర్శకులు ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. సుజిత్ తో చేస్తోన్న ఒజీ మూవీ మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కంప్లీట్ చేసి మెజారిటీ టైం రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్.