Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కలర్‌ ఫుల్‌ బ్రో బ్యూటీ కవ్వింపు

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని దక్కించుకుని మోడలింగ్ లో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 8:14 AM GMT
పిక్ టాక్ : కలర్‌ ఫుల్‌ బ్రో బ్యూటీ కవ్వింపు
X

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని దక్కించుకుని మోడలింగ్ లో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2021 లో తెలుగు లో రొమాంటిక్ అనే సినిమా తో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి.


తెలుగు లో ఈ అమ్మడు తన అందాల ఆరబోత కారణంగా రొమాంటిక్ నిరాశ పరిచిన కూడా వెంటనే లక్ష్య సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటించిన విషయం తెల్సిందే.


మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచినా కూడా పవన్‌ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమీ లేవు. కానీ ఒకటి రెండు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ కలర్ ఫుల్ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా స్కిన్ షో ఫోటోలతో వైరల్ అయ్యే ఈ అమ్మడు ఈసారి ఇలా పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే అందాల ఫోటోలను షేర్ చేసి కవ్వించింది.

ఇలాగే అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా కచ్చితంగా మళ్లీ ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.