వర్షాలు టెన్షన్ పెడుతున్నాయి బ్రో
అదే జరిగితే కచ్చితంగా బ్రో మూవీ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రిలీజ్ కి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది
By: Tupaki Desk | 26 July 2023 3:55 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ బ్రో. సాయి ధరమ్ తేజ్ మూవీలో మరో లీడ్ రోల్ లో నటించారు. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో టైంతో ఒక వ్యక్తి చేసే జర్నీని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
టైం, మార్కండేయ మధ్య మధ్య ఉన్న ప్రయాణం ఏంటి, అసలు అతనికే టైం ఎందుకు కనిపించింది అనేది సినిమాలో ఉండనుంది. ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా చేసింది. ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ చెల్లెలుగా మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే భారీ ఓపెనింగ్స్ కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి. అయితే బ్రో సినిమాకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వర్షాల ఎఫెక్ట్ తగిలింది. తెలంగాణాలో మరో మూడు రోజులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అలాగే ఏపీలో కూడా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రేక్షకులు వర్షంలో తుడుచుకొని థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే సాహసం చేయరు.
అదే జరిగితే కచ్చితంగా బ్రో మూవీ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రిలీజ్ కి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే వర్షాల తగ్గుతాయనే నమ్మకంతోనే చిత్ర యూనిట్ ఉంది. మొదటి రోజు వరకు అంతగా టెన్షన్ ఉండకపోవచ్చు. దానికి కారణం ఫస్ట్ డే మెజారిటీగా ఫ్యాన్స్ మాత్రమే సినిమాని చూసేవారిలో ఉంటారు. వారు వర్షాలు లెక్కచేయకుండా థియేటర్స్ కి వచ్చేస్తారు.
బ్రో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో వీకెండ్ పూర్తయిన తర్వాత వారు సినిమా చూడటానికి థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లు కూడా భారీ ఏమీ ఉండవని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అయితే ఎటొచ్చి వర్షం మాత్రం కొంత వరకు బ్రో టీం ని టెన్షన్ పెడుతోంది.