Begin typing your search above and press return to search.

కొన్ని నిమిషాలకే అంత ఫీలైతే.. వాళ్లేమైపోవాలి..?

అయితే, రెండు, మూడు నిమిషాల పాటు తన క్యారెక్టర్ ఉన్నందుకే అంబటి అంత ఫీలయ్యాడు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:09 AM GMT
కొన్ని నిమిషాలకే అంత ఫీలైతే.. వాళ్లేమైపోవాలి..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి తెరకెక్కించిన చిత్రం బ్రో. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. పవన్ వింటేజ్ లుక్ దగ్గర నుంచి, కంప్లీట్ గా ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ మూవీ తీయడం విశేషం. ఇక, మూవీ లో పొలిటికల్ పంచ్ లు కూడా వేయడం విశేషం.

ముఖ్యంగా శ్యాంబాబు అనే పాత్రను చిత్రీకరించడం ఇప్పుడు పెద్ద వివాదం గా మారింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాయుడు గతం లో, సంక్రాంతి సంబరాల సమయంలో డ్యాన్స్ వేసిన వీడియో అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అదే డ్రెస్ ని ఈ శ్యాంబాబు క్యారెక్టర్ కి వేసి, అచ్చంగా అదే డ్యాన్స్ చేయించారు. ఆ పాత్ర చేసిన వ్యక్తి కూడా గతం లో వైసీపీ కి చెందినవాడే కావడం విశేషం. అయితే, తన పాత్రను అలా మూవీ లో చూపించడంతో అంబటి బాగా హర్ట్ అయ్యారు.

ప్రెస్ మీట్ పెట్టి మరీ, పవన్, త్రివిక్రమ్ లపై విమర్శల వర్షం కురిపించారు. పవన్ క్యారెక్టర్ పెట్టి తాను కూడా సినిమాలు తీస్తానంటూ, చెత్త సినిమా పేర్లను కూడా చెప్పాడు. అయితే, రెండు, మూడు నిమిషాల పాటు తన క్యారెక్టర్ ఉన్నందుకే అంబటి అంత ఫీలయ్యాడు. మరి, పవన్, చంద్రబాబు, లోకేష్ లను దారుణంగా చూపిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయలేదా?

ఆర్జీవీ తీసిన పవర్ స్టార్, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు వంటి సినిమాల ను వైసీపీ నేతలు బాగానే ప్రమోట్ చేశారు. ఆ సినిమాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లను చాలా దారుణంగా చూపించారు. అయినా, వారు ఏ నాడూ, వాటి గురించి పన్నెత్తి మాట్లాడలేదు. వారి మద్దతుదారులు సైతం ఆ మూవీల గురించి ఇంత రభస చేసింది లేదు.

ఇక, ఆర్జీవీ సినిమాల వెనక ఉంది, వైసీపీ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల సమయానికి ఆర్జీవీ వ్యూవం అనే మరో సినిమా ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇదంతా వాళ్లని కించపరిచినట్లు కాదా? కేవలం డ్రెస్ వేసి డ్యాన్స్ వేసినందుకే అంబటి అంత ఫీలయ్యాడు, చంద్రబాబు, పవన్ లకు అయితే, అచ్చం అలా కనిపించేలా మేకప్ వేసి, వారే నటించినట్లుగా భ్రమ కలిగేలా చేసి మరీ సినిమాలు తీసి కించపరిచారు. దారుణమైన డైలాగులు చెప్పించారు. వారికి చేసినప్పుడు ఏమీ లేదు కానీ, మిమ్మల్ని రెండు నిమిషాలు చూపిస్తే, తట్టుకోలేకపోతున్నారా అంటూ కొందరు పవన్ అభిమానులు ప్రశ్నిస్తుండటం విశేషం. మరి వీటికి అంబటి దగ్గర సమాధానం ఉందో లేదో..?