Begin typing your search above and press return to search.

ఎంత కాంట్రవర్సీ వచ్చినా సినిమా క్లిక్కవ్వలేదుగా

అయినప్పటికీ రవి తదుపరి సినిమా విడుదల హడావుడితో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 3:09 PM GMT
ఎంత కాంట్రవర్సీ వచ్చినా సినిమా క్లిక్కవ్వలేదుగా
X

తమిళంలో ఇటీవల బాగా ట్రెండ్ అయిన నటుల్లో జయం రవి ఒకరు. సాధారణంగా కాంట్రవర్సీ లకు దూరంగా ఉండే అతను విడాకుల వార్తతో ఒక్కసారిగా ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాడు. అతని పై రకరకాలుగా కథనాలు రావడంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ చేసింది. అయినప్పటికీ రవి తదుపరి సినిమా విడుదల హడావుడితో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతని కాంట్రవర్సీ కారణంగా లేటెస్ట్ మూవీ బ్రదర్ కు బజ్ బాగానే హెల్ప్ అవుతుందని అనుకున్నారు. కానీ ఊహించని షాక్ ఎదురైంది.


జయం రవి నటించిన ‘బ్రదర్’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎం. రాజేష్ తెరకెక్కించారు. ఆయన ‘శివ మనసుల శక్తి,’ ‘వాసువం శరవణనుమ్ ఒన్న పడిచవంగా’ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందింది. ఈ సినిమా కంటెంట్ పై కూడా భారీ అంచనాలు లేకపోవడంతో మొదటి రోజు థియేటర్స్ వద్ద పెద్దగా సందడి కనిపించ లేదు.

రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా మంచి స్క్రీన్ కౌంట్‌తో విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. 'బ్రదర్’ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథ చాలా ప్లాట్‌గా ఉండటంతో పాటు, ప్రేక్షకులకు సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించలేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు కూడా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.

ఈ కారణంగా, ఈ సినిమా బుకింగ్స్‌లో తగ్గుదల కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆక్యుపెన్సీ 40% కన్నా తక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. బ్రదర్ సినిమా విడుదలకు ముందు జయం రవికి సంబంధించిన కొన్ని వివాదాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. విడాకుల సమస్యలు, ఇతర వివాదాలు సినీ ప్రపంచంలో కలకలం రేపాయి. అయితే, ఈ వివాదాలు సినిమా ప్రమోషన్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదని పరిశీలకులు చెబుతున్నారు.

జయం రవికి ‘పొన్నియన్ సెల్వన్’ 1, 2 చిత్రాలు తప్పి, గత ఐదు చిత్రాలు సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘జనీ’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా ద్వారా రవి గట్టిగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. జనీ చిత్రం ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది, ఈ సినిమా జయం రవికి మళ్లీ విజయం అందిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. మరి అతని లక్కు ఎలా ఉంటుందో చూడాలి.