బబుల్ గమ్ ట్రైలర్.. రోషన్ ఇజ్జత్ కా ప్యార్
రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు
By: Tupaki Desk | 15 Dec 2023 8:07 AM GMTటాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తనయుడి డెబ్యూ చిత్రం కోసం ఇద్దరు దంపతులు ఎన్నో కథలు విన్న తరువాత గాని బబుల్ గమ్ అనే ప్రాజెక్టు ఒకే చేయలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్, సాంగ్స్ విడుదలయ్యాయి. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. 42 సెకన్ల నిడివి ఉన్న బబుల్ గమ్ ట్రైలర్.. రోషన్ మాస్ ఫైట్ తో ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశాల్లో రోషన్ బాగానే నటించినట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది. మానస చౌదరీ కూడా గ్రామర్ షో బాగానే చేసినట్లు ఉంది. ఓ యువకుడి జీవితంలో ప్రేమ, శత్రుత్వం వంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంతో సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
హ్యాపీగా ఉండే ఓ బస్తీ కుర్రాడు ఆది(రోషన్ కనకాల) పార్టీల్లో డీజే వాయిస్తూ ఎప్పటికైనా మరో రేంజ్ కు వెళ్లాలని టార్గెట్ పెట్టుకుంటాడు. అయితే ఈ క్రమంలో రిచ్ గా కనిపించే జాను(మానస చౌదరి) అతని లైఫ్ ను మారుస్తుంది. ఆమె ఫ్యాషన్ లైఫ్ కు అంతగా కనెక్ట్ అవ్వని ఆది దూరమవ్వడం ప్రేమ పుట్టిన సమయంలో ఇంకో అబ్బాయి జానుకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు.
ఇక అతని లైఫ్ లో ఇజ్జత్ అనే అంశం చాలా బలంగా ఉండడంతో పోయిన ప్రేమను అడ్డుగా వచ్చే వారిని ఎలా ఎదిరించాడు అనే అంశాలను ట్రైలర్ లో హైలెట్ చేశారు. రోషన్ నటుడిగా చాలా బోల్డ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. రస్టిక్ యాక్షన్ డోస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ ఈ మూవీని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
బబుల్ గమ్ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా సినిమాలో వైవా హర్ష, అనన్య ఆకుల, కిరణ్, అను హసన్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జైరామ్ ఈశ్వర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ లో క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో డినిమాతో ఏదో కొత్తదనం ఉంటుందేమో అనే హోప్స్ ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. మరి రోషన్ తొలి చిత్రంతోనే హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.