Begin typing your search above and press return to search.

రోషన్, మానస లిప్ లాక్ సీన్స్.. సాంగ్ సో రొమాంటిక్

ఈ మూవీ నుంచి ఈజీ పీసీ అనే లిరికల్‌ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 12:09 PM GMT
రోషన్, మానస లిప్ లాక్ సీన్స్.. సాంగ్ సో రొమాంటిక్
X

తెలుగు యాంకర్ సుమ కనకాల, టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల.. బబుల్ గేమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కొత్త బ్యూటీ మానస చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ.. డిసెంబర్ 29న తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు మేక‌ర్స్. ఇప్ప‌టికే బ‌బుల్‌గ‌మ్ మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. అవి యూత్‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ మ్యూజిక‌ల్ అప్డేట్ ఇచ్చారు.

ఈ మూవీ నుంచి ఈజీ పీసీ అనే లిరికల్‌ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట‌కు ద‌ర్శకుడు రవికాంత్‌ పేరెపు స్వ‌యంగా లిరిక్స్ అందించారు. అంబికా శశిత్తాల్, ఎం శ్రావణ్ చక్రవర్తి పాడారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఫుల్ రొమాంటిక్‌గా సాగిన ఈ పాట ప్ర‌స్తుతం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ సాంగ్ లో రోషన్, మానస లవ్ కెమిస్ట్రీ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. హీరో ఎక్స్ ప్రెషన్ల తో అదరగొట్టాడని అంటున్నారు. ఓవరాల్ సాంగ్ అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. హీరో, హీరోయిన్లు ఓ ట్రిప్ కు వెళ్లినట్లు సాంగ్ లో తెలుస్తోంది. ఇద్దరూ కలిపి బీచ్, బోట్ పై ఫుల్ ఎంజాయ్ చేసినట్లు చూపించారు. ఘాటైన లిప్ లాక్ సీన్లను కూడా యాడ్ చేశారు.

అయితే ఈ సినిమా ప్రీమియర్స్ ను డిసెంబర్ 28వ తేదీన ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మూవీ టీమ్ తో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు సాధారణ ప్రేక్షకులకు కూడా అవకాశాన్ని కల్పించింది చిత్రబృందం. అందుకు సంబంధించి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. రిలీజ్ కు ముందు రోజు మూవీ టీమ్ తో కలిసి సినిమా చూసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరింది.

ఈ మూవీలో రోషన్, మానసతో పాటు హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయం కానున్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న ఓ యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాడు అనే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.