బుచ్చిబాబు నెంబర్ థర్డ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్!
యంగ్ మేకర్ బుచ్చిబాబు సానా ప్లానింగ్ చూసి గురువు సుకుమార్ షాక్ అయిన సంగతి తెలిసిందే. రెండవ సినిమాని ఏకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని చూసాడు.
By: Tupaki Desk | 1 Dec 2024 11:30 AM GMTయంగ్ మేకర్ బుచ్చిబాబు సానా ప్లానింగ్ చూసి గురువు సుకుమార్ షాక్ అయిన సంగతి తెలిసిందే. రెండవ సినిమాని ఏకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని చూసాడు. కానీ స్టోరీ సెట్ కాకపోవడంతో? అక్కడ నుంచి రామ్ చరణ్ దగ్గరకు వెళ్లి అతన్ని లాక్ చేసాడు. ఇక్కడే బుచ్చిబాబు ఎంతటి ప్రతిభావంతుడు అన్నది అర్దమ వుతుంది. మేకర్ గా పెద్దగా అనుభవం లేని బుచ్చిబాబుకు చరణ్ రెండవ సినిమా అవకాశం ఇచ్చాడు? అంటే? బుచ్చిబాబు సామర్ధ్యం అర్దమవుతుంది.
అటుపై ఇదే సినిమాకి మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ . రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకొచ్చాడు. రెహమాన్ చాలా కాలం తర్వాత పని చేస్తోన్న తెలుగు సినిమా ఇది. ఇలా ఇద్దరి గ్లోబల్ స్టార్లను బుచ్చిబాబు ఒప్పించి తన రెండవ సినిమా పట్టాలెక్కించాడు. మరి రెండవ సినిమానే ఈ రేంజ్ లో ప్లాన్ చేసిన బుచ్చిబాబు నెంబర్ థర్డ్ ఇంకే రేంజ్ లో ప్లాన్ చేస్తాడు? పాన్ ఇండియానే కాదు..పాన్ వరల్డ్ నే టార్గెట్ చేస్తాడు? అన్న సందేహం రావడం సహజం.
కానీ ఇది సందేహం కాదు...దాన్ని నిజం చేసే దిశగానే బుచ్చిబాబు అడుగులు పడుతున్నాయి? అన్నది తాజా సమాచారం. మూడవ చిత్రం కోసం ఏకంగా ముగ్గురు సూపర్ స్టార్లనే రంగంలోకి దించే స్క్రిప్ట్ బుచ్చిబాబు వద్ద సిద్దంగా ఉందన్న విషయం లీకైంది. టాలీవుడ్..బాలీవుడ్ ...కోలీవుడ్ నుంచి ముగ్గురు స్టార్ హీరోల్ని తీసుకుని ఏకంగా అంతర్జాతీయ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడుట. రెండు భాషల్లో ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెరకెక్కించాలన్నది బుచ్చిబాబు ప్లాన్ అట.
తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీనిలో భాగంగా కొంత మంది ఇంగ్లీష్ నటులు..హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుని సినిమా చేయాలని భావిస్తున్నాడుట. దీనిపై బుచ్చిబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి రెండేళ్లు అయినా సమయం పటొచ్చు. ఏంతైనా బుచ్చి సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన వాడు కదా. ఆ మాత్రం ఉంటుంది. ప్రస్తుతం బుచ్చిబాబు...చరణ్ హీరోగా ఆర్సీ 16 పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు.