Begin typing your search above and press return to search.

చరణ్‌, బుచ్చిబాబు సినిమా దాంతో మొదలు..!

రామ్‌ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:27 AM GMT
చరణ్‌, బుచ్చిబాబు సినిమా దాంతో మొదలు..!
X

రామ్‌ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. 2025 సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన వెంటనే బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్‌ సినిమా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్‌ ప్రారంభం ఎప్పుడు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యుల నుంచి ఆసక్తికర అప్డేట్‌ ఒకటి వినిపిస్తోంది.

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతున్న చరణ్‌, బుచ్చిబాబు సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఒక భారీ సెట్‌ ను నిర్మించడం జరిగింది. ఆ సెట్‌లో సినిమాకు సంబంధించిన పాటను మొదటగా చిత్రీకరించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా కోసం ఇప్పటికే ఆయన నాలుగు పాటలను ఇవ్వడం జరిగిందట. అందుకే మొదట పాటల చిత్రీకరణ మొదలు పెట్టడం ద్వారా చివరకు యాక్షన్‌, టాకీ పార్ట్‌ ను చేయాలని దర్శకుడు బుచ్చి బాబు భావిస్తున్నాడట. అందుకే పాటల చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందతున్న ఈ సినిమా షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ ఒక విలేజ్ సెట్‌లో చేయబోతున్నారు. భారీగా ఖర్చు చేసి ఆ విలేజ్ సెట్‌ ను నిర్మించారని తెలుస్తోంది. పీరియాడిక్‌ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అవ్వడంతో సెట్స్ నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, అప్పటి కరెన్సీ మొదలుకుని ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సినిమాను ది బెస్ట్‌గా దర్శకుడు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్ పోషిస్తున్న పాత్ర గురించి మొదటి నుంచి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఏపీకి చెందిన రామ్మూర్తి నాయుడు అనే బాడీ బిల్డర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారని, చరణ్ రామ్మూర్తి నాయుడు పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం మేకర్స్ నుంచి రాలేదు. ఇప్పటి వరకు సినిమా గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు బయోపిక్ ను అనధికారికంగా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది సినిమా వస్తే కానీ క్లారిటీ రాదు. సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్, బుచ్చిబాబు సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.