RC16 గురించి బుచ్చిబాబు షాకింగ్ వ్యాఖ్యలు!
రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' నిరాశ పరచడంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 19 Feb 2025 5:52 AM GMTరామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' నిరాశ పరచడంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ RC16 సినిమా రూపొందుతోంది. బుచ్చిబాబు మొదటి సినిమా 'ఉప్పెన' బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చిబాబు తన గురువు సుకుమార్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా ఫిల్మ్ మేకింగ్ నిపుణుడు అని ఉప్పెనతో నిరూపించుకున్నాడు. అందుకే RC16 పై అంచనాలు మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా అందరికీ ఉన్నాయి. అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందని బుచ్చిబాబు అంటున్నాడు.
తాజాగా దర్శకుడు బుచ్చిబాబు 'బాపు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాపై అంచనాలు పెంచారు. తన తండ్రి చనిపోయి ఏడాది అవుతుందని, నేను ఉప్పెన సినిమా తీసిన సమయంలో థియేటర్ వద్దకు వెళ్లి సినిమా ఎలా ఉందని అడిగారని, సినిమా రివ్యూను ఆయన థియేటర్ వద్ద ఉండి తీసుకున్నారని నాకు తెలిసిందని బుచ్చిబాబు అన్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్‌తో తీస్తున్న సినిమా విషయంలో అలాంటి అవసరం లేదని బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా సినిమా సూపర్ హిట్‌గా నిలుస్తుందనే విశ్వాసంను బుచ్చిబాబు వ్యక్తం చేశారు.
రంగస్థలం సినిమా రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది అంటూ మొదటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఒక రియల్ లైఫ్ హీరో కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. రియల్ పాత్రకు కల్పిత కథను జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి రికార్డ్‌లు బ్రేక్ అవ్వబోతున్నాయి అని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంను మరింతగా పెంచే విధంగా తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాపై దర్శకుడికి నమ్మకం ఉండటం సహజం. కానీ ఈ సినిమాపై బుచ్చిబాబుకు అంతకు మించి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో రొమాన్స్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్‌తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ అమ్మడు మరో విజయాన్ని రామ్ చరణ్ సినిమాతో దక్కించుకోవడం కన్ఫర్మ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. రంగస్థలంను మించి రామ్ చరణ్, సుకుమార్ మూవీ ఉండబోతుంది. మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ గురు, శిష్యుల సినిమాల మీదే ఉన్నాయి. మరి ఏ మేరకు వీరి సినిమాలు హిట్‌గా నిలుస్తాయి అనేది చూడాలి.