ఆర్సీ16 కోసం బుచ్చిబాబు అంతలా ఏం ప్లాన్ చేశాడో మరి
ఆర్సీ16ను బుచ్చిబాబు సాలిడ్ స్టోరీతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 Feb 2025 9:43 AM GMTఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ ఛేంజర్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ కెరీర్లో 16వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతుంది. రామ్ చరణ్ సైతం ఈ కీలక షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు.
ఆర్సీ16ను బుచ్చిబాబు సాలిడ్ స్టోరీతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటూనే అల్టిమేట్ అనిపిస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆర్సీ16 కోసం బుచ్చిబాబు ఓ విషయంలో తన గురువైన సుకుమార్ దారిలో వెళ్ళనున్నాడని తెలుస్తోంది.
రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతటి హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా కథ మొత్తం ఒకెత్తు అయితే క్లైమాక్స్ మరొక ఎత్తు అని అందరూ చెప్తుంటారు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా తన గురువు దారిలోనే ఆర్సీ16 ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ఆర్సీ16 క్లైమాక్స్ ను బుచ్చిబాబు ఎవరూ ఊహించని విధంగా నెక్ట్స్ లెవెల్ లో రాసుకున్నాడని, సినిమా క్లైమాక్స్ చాలా కాలం పాటూ అందరికీ గుర్తుండిపోతుందని చిత్ర యూనిట్ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. మరి అంతలా బుచ్చిబాబు ఆ క్లైమాక్స్ లో ఏం ప్లాన్ చేశాడో అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.