Begin typing your search above and press return to search.

రామ్‌ చరణ్ ఆట వెంటనే మొదలవ్వదా..?

ఇటీవలే షూటింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   22 May 2024 7:55 AM GMT
రామ్‌ చరణ్ ఆట వెంటనే మొదలవ్వదా..?
X

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్ఆర్ తో గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. ఈయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు గత ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్‌ చేంజర్ ఎప్పటికి విడుదల అవుతుంది అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.

శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ సినిమాను ఇప్పటికే విడుదల చేయాలని భావించినా కూడా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల చరణ్‌ ఫ్యాన్స్ కి వెయిటింగ్‌ తప్పడం లేదు. గేమ్‌ చేంజర్ పూర్తి అవ్వకుండానే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ కొత్త సినిమా కు కమిట్ అయ్యాడు.

ఇటీవలే షూటింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి మరియు మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్‌ చేంజర్ పూర్తి అయ్యే వరకు బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా ప్రారంభం అయ్యే అవకాశాలు లేవట.

చరణ్‌ ను తన సినిమాలో బుచ్చి బాబు విభిన్నంగా చూపించాలని ఆశ పడుతున్నాడట. పల్లెటూరు సోర్ట్స్ డ్రామా గా చరణ్‌ తో సినిమాను బుచ్చిబాబు రూపొందించబోతున్నాడు. పల్లెటూరు కుర్రాడి లుక్‌ లో కాస్త పొడవు జుట్టు తో పాటు, రగ్‌డ్‌ లుక్‌ తో చరణ్ ను చూపించే ఉద్దేశ్యంతో బుచ్చిబాబు ఉన్నాడు.

అందుకే గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత బుచ్చిబాబు సినిమా కోసం రామ్‌ చరణ్ ఏకంగా మూడు నెలల సమయం తీసుకుని కొత్త హెయిర్‌ స్టైల్ కి రావడంతో పాటు ఫిజిక్ ను కూడా మార్చబోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

అదే నిజం అయితే గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు చరణ్‌ ఆట (స్పోర్ట్స్ డ్రామా) మొదలు అయ్యే అవకాశాలు లేవు. జులై లేదా ఆగస్టు వరకు చరణ్‌ గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ లోనే ఉంటాడు. ఆ తర్వాత రెండు మూడు నెలలు అంటే బుచ్చిబాబు ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ కు వెళ్లాలి అంటే వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

ఈ లోపు చరణ్ లేని సన్నివేశాలను, మరియు సెకండ్‌ యూనిట్‌ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. ఎంత ఆలస్యంగా మొదలు పెట్టినా కూడా వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా బుచ్చి బాబు ప్లాన్‌ చేస్తున్నాడట.