Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు సలహా మేరకు చరణ్‌...!

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ 'గేమ్‌ చేంజర్‌' సినిమా షూటింగ్‌ ను మరి కొన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు

By:  Tupaki Desk   |   18 Jun 2024 12:57 PM GMT
బుచ్చిబాబు సలహా మేరకు చరణ్‌...!
X

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ 'గేమ్‌ చేంజర్‌' సినిమా షూటింగ్‌ ను మరి కొన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు. ఈ ఏడాదిలో ఖచ్చితంగా గేమ్‌ ఛేంజర్ వస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. జూన్ చివరి వరకు ఈ సినిమా కు గుమ్మడి కాయ కొట్టే విధంగా దర్శకుడు శంకర్‌ ప్లాన్‌ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.

గేమ్‌ చేంజర్ తర్వాత చరణ్‌ చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. భారీ అంచనాల నడుమ బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ మూవీ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చివరి దశలో ఉంది.

ఆగస్టు లో సినిమాను పట్టాలెక్కించే విధంగా దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం చరణ్‌ ప్రత్యేకమైన లుక్‌ కి మారబోతున్నాడని, బాడీ విషయంలో కూడా చాలా మార్పు కనిపించబోతుందని సమాచారం అందుతోంది.

బుచ్చిబాబు తన కథలోని పాత్ర కోసం చరణ్ ను మారాల్సిందిగా విజ్ఞప్తి చేశాడట. అంతే కాకుండా తాను అనుకున్న పాత్రలోకి మారడం కోసం ఆస్ట్రేలియా వెళ్లి మరీ న్యూ మేకోవర్‌ కి ప్లాన్‌ చేయాలని సలహా ఇచ్చాడట. బుచ్చిబాబు సలహా మేరకు చరణ్‌ జులై లో ఆస్ట్రేలియా వెళ్లబోతున్నాడట.

గతంలో బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు ఎక్కడైతే బాడీ బిల్డింగ్‌ చేశారో అక్కడే చరణ్ కూడా బాడీ బిల్డింగ్‌ కి వెళ్లబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు తన వర్కౌట్ లు అక్కడ చేయబోతున్నాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే పద్దతిని ఫాలో అవ్వబోతున్నాడు.

చరణ్ తో బుచ్చిబాబు రూపొందించబోతున్న సినిమాలో హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ నటించబోతుంది. ఇప్పటికే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ వెంటనే చరణ్ కి జోడీగా నటించే అవకాశం దక్కించుకోవడం లక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.