శిష్యుడి గురించి గురువు ముందే ఊదేసాడా?
సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు అప్పుడే ఇండస్ట్రీనే ఏలేస్తోన్న కళ్ల ముందు వైనం కనిపిస్తూనే ఉంది
By: Tupaki Desk | 29 March 2024 12:30 AM GMTసుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు అప్పుడే ఇండస్ట్రీనే ఏలేస్తోన్న కళ్ల ముందు వైనం కనిపిస్తూనే ఉంది. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చి రెండవ సినిమాని ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే తీస్తున్నాడు. ఈ సినిమాతో అతడు అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోతాడు. భారీ అంచనాల మధ్య తెరకె క్కిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. వాస్తవానికి చరణ్ కంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయాలి. కానీ ఆ ఛాన్స్ జస్ట్ మిస్ అయింది.
చరణ్ తో హిట్ కొడితే తారక్ వెంటనే లైన్ లోకి వచ్చేసాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్లిద్దరితో హిట్లు అందుకుంటే ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ సీన్ లోకి వచ్చేస్తాడు. మరి బుచ్చిబాబుకి ఇన్ని అవకాశాలు ఎలా అంటారా? అంటే అందుకు అతడి ప్రతిభ కారణమైతే?...అక్కడి వరకూ చేరుకోవడానికి గురువు సుకుమార్ ఎంతో సాయం చేసాడు. చరణ్..మహేష్..తారక్ ఈ ముగ్గురికి బుచ్చి ట్యాలెంట్ గురించి సుకుమార్ ముందే చెవిలో వేసేసారు. అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో భవిష్యత్ లో పెద్ద దర్శకుడు అవుతాడని ముందే చెవిలో ఊదేయడంతో ఆ హీరోలు కూడా అంతే అలెర్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య బుచ్చిబాబు కొన్ని ఇంటర్వ్యూలో ఆ ముగ్గురి హీరోలతో తనకున్న ర్యాప్ గురించి రివీల్ చేస్తుంటే ఇవన్నీ అర్ధమవుతున్నాయి. 'నాన్నకు ప్రేమతో' సినిమా చేస్తోన్న సమయంలోనే ఎన్టీఆర్ బుచ్చి అని ముద్దుగా పిలచేవారు... ఇంకా పలు రకాలుగా తారక్ తన స్టైల్లో సంబోధించేవారు. అలా పిలవడం చూసి బుచ్చిబాబు నన్నే అలా పిలుస్తున్నాడా? అని ఆశ్చర్యపోయిన సందర్భం ఉంది.
సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ని తారక్ లాంటి నటుడు అలా పిలిచాడు అంటే ఆ మాత్రం సీన్ అర్దం కాలేదా? అప్పుడే స్టోరీ ఉంటే చెప్పు అని అడిగేవారు. ఆ చనువుతోనే కొన్నాళ్ల పాటు ఇద్దరి స్టోరీ జర్నీ కూడా సాగింది. అలాగే 'రంగస్థలం' సమయంలో చరణ్ తో అలాగే ర్యాపో బిల్డ్ అయింది. 'వన్ నేనెక్కడినే' సమయంలోనూ మహేష్ దృష్టిని ఆకర్షించాడు. మహేష్ ఇంటికి వెళ్లడం..రావడం వంటి వాటితో బాగా క్లోజ్ అయ్యాడు. అలా ముగ్గురి దృష్టిని బుచ్చి డైరెక్టర్ కాకముందే ఆకర్షించాడు.