Begin typing your search above and press return to search.

RC 16: బుచ్చిబాబు ప్రాబ్లం అతనే..

అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. అతని డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 5:52 PM IST
RC 16: బుచ్చిబాబు ప్రాబ్లం అతనే..
X

ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని దర్శకుడు బుచ్చిబాబు మళ్ళీ తదుపరి సినిమాను స్టార్ట్ చేయడంలో మాత్రం చాలా గ్యాప్ అయితే తీసుకుంటున్నాడు. అతనికి ఇదివరకే చాలా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఎక్కడ కూడా తొందరపడలేదు. చేస్తే రెండవ సినిమాను అగ్ర హీరోతోనే చేయాలి అని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు.

మొదట జూనియర్ ఎన్టీఆర్ తో ఒక కథను అనుకున్నప్పటికీ అది సెట్ అవ్వకపోవడంతో మళ్లీ రామ్ చరణ్ కు షిఫ్ట్ అయ్యాడు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబును నమ్మి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. కథ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే హీరో పాత్ర కంటే విలన్ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా ఉండాలి అని బుచ్చిబాబు ఆలోచోస్తున్నాడట.

ఇద్దరు ముగ్గురు ప్రముఖ హీరోలను విలన్ గా తీసుకోవాలని నిర్మాతలతో కూడా చర్చించాడట. అయితే మళ్లీ అతని ఫోకస్ విజయ్ సేతుపతి పైనే పడినట్లుగా టాక్ అయితే వినిపించింది. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిని చాలా పవర్ఫుల్ గా చూపించిన బుచ్చిబాబు మళ్ళీ మరోసారి అతని స్టార్ ఇమేజ్ ను సినిమాలో వాడుకోవాలని అనుకుంటున్నాడు.

అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. అతని డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారిపోయింది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా కూడా సేతుపతి అసలు టెంప్ట్ అవ్వని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక ఉప్పెన సినిమాకు ఎలాగైతే బుచ్చిబాబు అతని వెంబడిపడ్డాడో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం అదే తరహాలో డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అతనికి కుదిరిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనేంతగా బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడట. రామ్ చరణ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని నిర్మాతలు కూడా అతని నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక గతంలోనే విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా టాక్ అయితే వినిపించింది. ఇక అప్పుడు కానీ అతను డేట్స్ వలన చేయకపోవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ బుచ్చిబాబు అతన్ని మళ్లీ మళ్లీ సంప్రదించేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.