Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ 'బ‌డ్డీ' రిలీజ్ ట్రైలర్.. KGF పెద్దమ్మతో టెడ్డీబేర్‌!

‘ఊర్వశివో రాక్షసీవో’ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన చిత్రం ''బ‌డ్డీ''.

By:  Tupaki Desk   |   30 July 2024 11:10 AM GMT
అల్లు శిరీష్ బ‌డ్డీ రిలీజ్ ట్రైలర్.. KGF పెద్దమ్మతో టెడ్డీబేర్‌!
X

‘ఊర్వశివో రాక్షసీవో’ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన చిత్రం ''బ‌డ్డీ''. శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించగా.. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించారు. కథలో ఓ టెడ్డీబేర్‌ పాత్ర కీలకంగా ఉండనుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, సాంగ్.. అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

టెడ్డీ వరల్డ్ ను పరిచయం చేస్తూ ప్రారంభమైన 'బ‌డ్డీ' రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీంట్లో అల్లు శిరీష్ తో పాటుగా టెడ్డీబేర్‌ సన్నివేశాలను ప్రధానంగా చూపించారు. శిరీష్ ఎప్పటిలాగే స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టాడు. టెడ్డీబేర్‌ చేసే అల్లరి, విన్యాసాలు, ఫైట్స్, డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ చిన్న పిల్లలను, ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. చివర్లో KGF, ఖైదీల రేంజ్ లో టెడ్డీబేర్‌ మెషిన్ గన్ తో కాల్పులు జరపడం ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.

పెద్దగా డైలాగ్స్ లేకుండా శిరీష్, టెడ్డీల మీద కట్ చేసిన 'బ‌డ్డీ' రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. హీరో టెడ్డీల మధ్య బాండింగ్ ను, వీరిద్దరి సాహసాలను చూపించే ప్రయత్నం చేసారు. దీనికి విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టుగా రిచ్ గా ఉన్నాయి. ఇందులో ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఒక టెడ్డీబేర్ తో కలిసి హీరో అన్యాయాలను ఎదుర్కోవడం అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో 'బడ్డీ' చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పైలట్ ఆదిత్య రామ్‌ పాత్రలో శిరీష్ కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 2 గంటల 10 నిమిషాల క్రిస్ప్ రన్‍ టైమ్‍తో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

''బ‌డ్డీ'' చిత్రం ఆగస్టు 2వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని అన్ని వర్గాల వారికి చేరువ చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ సాధారణం కంటే చాలా తక్కువ ధరలకే టికెట్లు విక్రయిస్తున్నారు. సింగిల్ స్క్రీన్‍లలో టికెట్ ధర రూ.99, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేటు రూ.125గా ఉండనున్నట్టు రిలీజ్ ట్రైలర్ ద్వారా ప్రకటించారు. జనాలను థియేటర్లకు రప్పించడానికి ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అధిక టికెట్ రేట్ల వల్ల చాలామంది సినిమా హాళ్లకు దూరమవుతున్నారనే మాట వినిపిస్తోంది. కాబట్టి తక్కువ రేట్లు పెట్టడం వల్ల అల్లు శిరీష్ సినిమాని ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ మౌత్ టాక్ బాగుంటే ఆటోమేటిక్ గా వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.