Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్.. అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీ!

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:38 AM GMT
అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్.. అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీ!
X

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ. సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అయితే అల్లు శిరీష్.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా నెలలు అవుతోంది. చివరగా ఊర్వశివో రాక్షసివో సినిమాతో వచ్చిన ఆయన.. ఇప్పుడు బడ్డీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇప్పుడు మేకర్స్.. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చ‌రిత్ర‌లో ఇప్పటి దాకా ఎప్పుడు అన్యాయం జ‌రిగినా.. ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతను చూసుంటారు. అన్యాయం పై తిరగబ‌డ్డ ఒక టెడ్డీ బేర్ ను చూశారా.. చూశారా.. చూస్తారా? అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో స్ట్రాంగ్ డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. వెంటనే టెడ్డీ ఎంట్రీ ఇచ్చింది. విలన్లతో ఫైట్ సీన్స్ లో టెడ్డీ అదరగొట్టేస్తుంది. తన ప్రతాపమేంటో చూపిస్తుంది.

ఆ తర్వాత టెడ్డీ బేర్ కు హెల్ప్ చేసే పాత్రలో అల్లు శిరీష్ ఎంట్రీ ఇస్తారు. కెప్టెన్ ఆదిత్య రామ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అప్పుడే అలీ ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో అలరించారు. శిరీష్ పనిచేసే ఎయిర్ లైన్స్ లోనే వర్క్ చేసే హీరోయిన్ తో హీరో లవ్ ట్రాక్ కనిపించింది. అసలు బడ్డీ ఎవరు? ఆదిత్య రామ్ తో బడ్డీకి ఎలా పరిచయం? చివరికి ఏమైంది? అనేది సినిమా కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

మొత్తానికి ట్రైలర్ లో అల్లు శిరీష్.. కొత్తగా కనిపించారు. తన యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టారు. విలన్ గా అజ్మల్ అమీర్ ఆకట్టుకున్నారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఫుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిషా తన క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తుంది. టెడ్డీ.. వేరే లెవెల్ లో ఫైట్ సీన్స్ తో చితక్కొట్టింది. మొత్తానికి ట్రైలర్ ను మేకర్స్ బాగానే కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా వస్తున్నట్లు తెలుస్తోందని నెటిజన్లు అంటున్నారు.

స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భారీ బడ్జెట్‌తో బడ్డీ మూవీని రూపొందించింది. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీతోపాటు మరికొందరు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హిప్‌ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్నారు. జులై 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందీ చిత్రం. మరి కాస్త గ్యాప్ తర్వాత వస్తున్న అల్లు శిరీష్.. బడ్డీ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.